భర్తని పేరు పెట్టి పిలుస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ప్రస్తుత కాలంలో మన ఇంట్లో కుటుంబ సభ్యులను కానీ లేదా భార్య భార్యను పిలుచుకునే విధానం లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇతరులని పేరు పెట్టి పిలుస్తున్నారు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పేర్లతోనే పలకరించుకుంటున్నారు.శాస్త్రం ప్రకారం ఇలా పిలుచుకోవడం పూర్తిగా తప్పని పండితులు తెలియజేస్తున్నారు.

మన శాస్త్రం ప్రకారం పెద్ద వారిని గౌరవించాలని చెబుతారు.ఈ క్రమంలోనే వయసులో మన కన్నా పెద్దవారిని గౌరవిస్తూ వారిని పేర్లతో కాకుండా అన్న అక్క అత్త మామ వంటి పేర్లతో గౌరవిస్తూ పిలవాలని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి అధికంగా కనిపిస్తుంది.ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అయితే ఒకరి మధ్య ఒకరికి గౌరవం అనేది లేకుండా పోతుంది.

Advertisement
As Per Our Hindu Religion Wife Must Not Call Her Husband By Name Wife And Husban

ఈ క్రమంలోనే భార్య భర్తని పేరు పెట్టి పిలవడం మనం చూస్తున్నాము.ఇలా పిలవటం వల్ల భర్త ఆయుష్షు క్షీణించి పోతుందని పండితులు చెబుతున్నారు.

అందుకే భార్య భర్తని ఎప్పుడూ కూడా పేర్లు పెట్టి పిలవకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

As Per Our Hindu Religion Wife Must Not Call Her Husband By Name Wife And Husban

పూర్వకాలంలో ఒక భార్య భర్తని శ్రీవారు, ఏమండీ, మా ఆయన అంటూ సంబోధిస్తూ వారితో మాట్లాడటం వారిని పిలవడం జరిగేది.కానీ ప్రస్తుత కాలంలో ఎవరు కూడా భర్తలను అలా పిలవకపోవడం సరికదా.పేరు పెట్టి పిలుస్తున్నారు.

ఇలా పిలవడం వల్ల భర్తకు ఆయుష్షు క్షీణించిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు.అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు గౌరవించుకుంటూ పిలవడం వల్ల ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని, ఆ ఇంటిలో సుఖసంతోషాలకు సంపదలకు ఏ మాత్రం కొదవు ఉండదని, వారి మధ్య భార్యాభర్తల బంధం ఎంతో బలపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు