రివ్యూ : ఎన్నో కష్టాలు పడి వచ్చిన 'అర్జున్‌ సురవరం' మెప్పించాడా?

నిఖిల్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా రూపొందిన అర్జున్‌ సురవరం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదట ఈ చిత్రాన్ని ముద్ర అనే టైటిల్‌తో విడుదల చేయాలని భావించారు.

కాని ఆ టైటిల్‌తో మరో సినిమా వచ్చింది.దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది.

తన కెరీర్‌లో అత్యధికంగా శారీరకంగా మరియు మానసికంగా కష్టపడ్డ సినిమా ఇదే అంటూ నిఖిల్‌ పలు సందర్బాల్లో చెప్పాడు.మరి అంత కష్టపడ్డ ఈ సినిమా సక్సెస్‌ దక్కించుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : యంగ్‌ అండ్‌ డైనమిక్‌ జర్నలిస్ట్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం(నిఖిల్‌).ఈయన తన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టింగ్‌తో సమాజంలో జరుగుతున్న పలు సంఘ విద్రోహక పనులను అడ్డుకుంటూ ఉంటాడు.

Advertisement

అలా అర్జున్‌ సురవరం ఒక జాతీయ స్థాయి స్కామ్‌ గురించి తెలుసుకుని దాన్ని లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు సిద్దం అవుతాడు.ఆ సమయంలో అతడిపై పోలీసులు కేసులు నమోదు అవుతాయి.

అతడిని పోలీసులు మరియు జనాలు అపార్థం చేసుకుంటారు.ఇంతకు ఆ పెద్ద స్కామ్‌ ఏంటీ? పోలీసు కేసుల నుండి బయట పడి తన నిర్ధోశిత్యంను ఎలా నిరూపించుకుంటాడు అనేది సినిమా కథ.నటీనటుల నటన : నిఖిల్‌ మొదటి నుండి చెబుతున్నట్లుగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది.చాలా కాలం పాటు ఈ సినిమాను చేశారు.

ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి.యాక్షన్‌ సీన్స్‌లో నిఖిల్‌ నటన బాగుంది.

హీరోయిన్‌తో రొమాన్స్‌ విషయంలో తేలిపోయాడు.ఎమోషన్‌ సీన్స్‌లో నిఖిల్‌ నటనతో మెప్పించాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

మొత్తంగా అర్జున్‌ లెనిన్‌ సురవరం పాత్రకు నిఖిల్‌ ప్రాణం పోసినట్లుగా నటించాడు.ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి తక్కువ ప్రాముఖ్యత ఉంది.

Advertisement

సినిమాలో ఆమె కనిపించింది తక్కువే.అయితే ఉన్నంతలో ఆమె మెప్పించింది.

ఇక వెన్నెల కిషోర్‌ కామెడీతో మెప్పించాడు.సత్య కూడా నిఖిల్‌ స్నేహితుడి పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు.

మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.టెక్నికల్‌ : ఈ సినిమాలోని పాటల గురించి పెద్దగా పట్టించుకునే అవకాశమే లేదు.ఎందుకంటే ఏ ఒక్క పాట కూడా అబ్బ బాగుందే అన్నట్లుగా లేదు.

పాటల చిత్రీకరణ కూడా సో సో గానే ఉంది.అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం చాలా బాగుంది.

కొన్ని సీన్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎక్కడికో తీసుకు వెళ్లింది.ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

కొన్ని ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ మరియు చేజింగ్‌ సీన్స్‌లో సినిమాటోగ్రఫీ పనితనం చాలా బాగుంది.ఇక ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి.

మొత్తంగా బాగానే ఉంది.దర్శకుడు సంతోష్‌ కథను విభిన్నంగా నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు.

స్క్రీన్‌ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : కష్టానికి ఫలితం ఉంటుంది, మంచి సినిమాను ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆధరిస్తారని టాలీవుడ్‌లో గతంలో చాలా సార్లు నిరూపితం అయ్యింది.అలాగే ఈ సినిమాకు కూడా ఆ సూత్రం వర్తిస్తుందని అంతా భావిస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమా చాలా కాలం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.దాంతో కొందరు ఈ సినిమాపై అపనమ్మకం పెంచుకున్నారు.

కాని వారి అపనమ్మకంను పటా పంచలు చేసేలా సినిమా ఉంది.నిఖిల్‌ ఈ సినిమాలో మెప్పించాడు.

నిఖిల్‌ నుండి బ్లాక్‌ బస్టర్‌ ను ప్రేక్షకులు ఏమీ ఆశించడం లేదు.ఒక మంచి సినిమాను మాత్రమే జనాలు ఆశిస్తున్నారు.

అదే ఈ సినిమా రూపంలో నిఖిల్‌ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.ఒకసారి చూడదగ్గ సినిమాగా ఈ సినిమా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నిఖిల్‌ షోతో పాటు మంచి స్క్రీన్‌ప్లేతో సినిమా ఆకట్టుకునేలా ఉంది.ప్లస్‌ పాయింట్స్‌ : నిఖిల్‌, కొన్ని ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌, కథలో టర్నింగ్‌ పాయింట్‌ మైనస్‌ పాయింట్స్‌ : మ్యూజిక్‌, కొన్ని సీన్స్‌ సాగతీసినట్లుగా ఉన్నాయి, హీరో హీరోయిన్‌ మద్య రొమాన్స్‌ లేదు బోటమ్‌ లైన్‌ : అర్జున్‌ సురవరం ఒకసారి చూస్తే నష్టం ఏమీ లేదు.

తాజా వార్తలు