తల వరకు పూర్తిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త..?

ప్రతి ఒక్కరికి నిద్రపోయేటప్పుడు ఎన్నో రకాల అలవాట్లు ఉంటాయి.కొందరికి దిండు లేకుండే నిద్రించే అలవాటు ఉంటుంది.

మరికొందరికి కఠినమైన దిండు అలవాటు ఉంటుంది.అయితే శీతాకాలంలో కొంతమందికి దుప్పటితో మొహం( Face with blanket ) వరకు మూసుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది.

అయితే మీ నిద్ర అలవాటు కూడా మీకు హాని కలిగిస్తుందని తెలుసా? చలికాలంలో ప్రజలు తరచుగా తమ మొహాలను పూర్తిగా దుప్పటితో కప్పుకొని నిద్రపోతూ ఉంటారు.దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.

తలనొప్పి, వాంతులు( Headache, vomiting ) మరియు ఊపిరాడకపోవడం లాంటివి కనిపిస్తుంటాయి.మీరు కూడా ఉదయం నిద్ర లేవగానే ఇలా అనిపిస్తే వైద్యుల సలహాను పాటించాలి.

Advertisement
Are You Sleeping With A Blanket Covering Your Head Completely But Be Careful , H

అయితే దుప్పటి తో మొహం మూసుకోకుండా నిద్రపోవాలని వైద్యులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.మొహం కప్పుకొని నిద్ర పోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపోతున్నప్పుడు తలను కప్పుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.ఇది అల్జీమర్స్( Alzheimers ) మరియు డిమెన్షియా( Dementia ) ప్రమాదాన్ని పెంచుతుంది.

పరిశోధకుల ప్రకారం మీరు దుప్పటి కప్పుకొని నిద్ర పోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది.

Are You Sleeping With A Blanket Covering Your Head Completely But Be Careful , H

అందువల్ల నిద్రపోయేటప్పుడు దుప్పటితో తల వరకు కప్పుకోకూడదు.ఇంకా చెప్పాలంటే దుప్పటితో తల వరకు కప్పుకునే వారు చలి ప్రభావం వల్ల మెత్తని బొంత లోపలికి చొచ్చుకపోకుండా తలపై మెత్తని దుప్పటిని కూడా కప్పుకుంటారు.ఇలాంటి పరిస్థితులలో ఆక్సిజన్ సరఫరా అందక ఊపిరాలేకపోవడం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మీరు ఉబ్బసం రోగి అయితే ఆక్సిజన్ లేకపోవడం వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారవచ్చు.కొన్నిసార్లు గుండెపోటు కూడా రావచ్చు.

Are You Sleeping With A Blanket Covering Your Head Completely But Be Careful , H
Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే స్లిప్ అప్నియా, ఆస్తమా, గుండె జబ్బులు మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి తలవరకు కప్పుకొని నిద్ర పోవడం మరింత ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇది ఊపిరాడకుండా చేస్తుంది.అదే సమయంలో మూసి ఉన్న గదులలో దుప్పటిని తలవరకు కప్పుకొని నిద్రపోవడం వల్ల ఊపిరాడని సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు