చనిపోతామంటూ రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ అసలు ఏమైంది ?

ఏపీలో రాజధాని తరలింపు వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా ఏపీ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.

అయినా జగన్ ప్రభుత్వం మాత్రం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెబుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని నిర్ణయించారు.దీనికి అనుగుణంగానే అక్కడ భారీగా నిధులు కేటాయింపు చేస్తున్నారు.

అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రజల అంగీకారంతోనే ముందుకు వెళ్దాం అని చెబుతూ రాజధాని వ్యవహారంపై హైపవర్ కమిటీని జగన్ నియమించారు.కానీ అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలకు పరిస్థితిని వివరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి.

దీని కారణంగానే రెండు వారాలుగా నిరసనలు దీక్షలు చేస్తున్న అమరావతి పరిసర ప్రాంతాల రైతులు తమ ఆందోళన మరింత ఉదృతం చేశారు.

Advertisement

రాజధాని తరలించి మా బతుకులను అతలాకుతలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ పరిస్థితుల్లో తమకు చావు ఒక్కటే పరిష్కారం అని చెబుతూ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అమరావతి రైతులు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కు లేఖ రాశారు.రాజధాని విషయంలో ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది కనుక చనిపోయే అవకాశం తమకు కల్పించాలంటూ ఆ లేఖలో వివరించారు.ఆ లేఖను ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం.

అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారు.కేవలం ముఖ్యమంత్రి, మరి కొంత మంది వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారు.

దయచేసి రాజధానిని మార్చవద్దు అంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళన చేస్తున్నా మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేరు.పైగా అధికార పార్టీ నేతలు అపహాస్యం చేస్తున్నారు.

కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న శాసన సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని ఎడారి అని ఒకరు.ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు.

Advertisement

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైల్లో పెడుతున్నారు.అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు.

మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.అండ గా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది.

ఒక మంచి కార్యక్రమం కోసం మేము చేసిన త్యాగాలకు దక్కిన ఫలితం ఇది.రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం.ఈ బతుకులు మాకొద్దు ఇక మాకు మరణమే శరణ్యం.

దయవుంచి కారుణ్య మరణానికి అనుమతివ్వండి అంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు