నెలాఖరు వరకు సమస్య పరిష్కరిస్తానన్న సీఎం జగన్‌

ఏపీలో ప్రస్తుతం ఇసుక కొరత కారణంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది.

దాదాపు పాతిక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర స్థాయిలో ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ఇసుక కొరతతో వారు అంతా కూడా ఖాళీగా ఉంటున్నారు.ఆ కారణంగానే కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

దాంతో వారి కోసం ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.ప్రజలు మరియు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనతో సీఎం జగన్‌ ఇసుక సమస్యపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.

ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇసుక సమస్యపై సమీక్ష నిర్వహించిన తర్వాత జగన్‌ మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఊహించని విధంగా వరదలు వస్తున్న కారణంగా ఇసుక సమస్య తలెత్తింది.

Advertisement

రాష్ట్రంలో మొత్తం 265 ఇసుక త్రవ్వే ప్రాంతాలు ఉన్నాయి.వాటిలో ప్రస్తుతం 61 మాత్రమే పని చేస్తున్నాయి.

కనుక ఇసుక సమస్య తలెత్తుతుంది.త్వరలోనే వరదలు తగ్గితే మళ్లీ ఇసుక సమస్యలకు చెక్‌ పడుతుంది.

గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేయడం వల్లే ప్రస్తుతం ఈ సమస్య అంటూ సీఎం జగన్‌ అన్నారు.ఇసుక సమస్యపై ప్రతిపక్షాలు అతిగా స్పందించనక్కర్లేదని, సహజ సిద్దంగా ఏర్పడిన కొరతను కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ జగన్‌ అన్నారు.

లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!
Advertisement

తాజా వార్తలు