జమిలి ఎన్నికలు ఖాయం .. చంద్రబాబూ సిద్ధం

ఓకే దేశం ఓకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికలకు( Jamili Elections ) కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) సిద్ధం అవుతోంది .

ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్నా,  2027లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

ఈ విషయమై తమ మిత్రపక్షాలకూ సమాచారం ఇస్తున్నారు.ఈ మేరకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు( CM Chandrababu Naidu ) జమిలి ఎన్నికల విషయమై ప్రధాన నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సంకేతాలు ఇచ్చారట.2027 లో కచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని,  దానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని చెప్పడంతో చంద్రబాబు సైతం జమిలి ఎన్నికలకు అంగీకారం తెలిపారట.ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు జమిలి ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2027 ఎన్నికలకు( 2027 Elections ) సిద్ధంగా ఉండాలని , కేంద్ర ప్రభుత్వం ఈ లోపు ఏపీలో కూటమి పార్టీలు హామీలను అమలు చేసే విధంగా తగిన సహాయం అందిస్తుందని ప్రధాని మోది చంద్రబాబుకు హామీ సైతం ఇచ్చారట.దీంతో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు.అయితే ఈ విషయాన్ని పూర్తిగా పార్టీ నేతలకు చెప్పనప్పటికీ,  కొంతమంది కీలక నేతలకు ఈ విషయంపై బాబు సమాచారం ఇచ్చారట.

జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని , ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రకటన చేశారు. 

Advertisement

ఎలాంటి ఎన్నికల కోడ్ పనులకు అడ్డు రాదని,  పాలన సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుందని బాబు చెప్పడంతో మానసికంగా ఆయన జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగానే కనిపిస్తున్నారు.దీంతో ఏపీలో 2027 లోని శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.మళ్లీ టీడీపీ, జనసేన , బిజెపి కాంబినేషన్ లోనే వెళ్లనున్నారట 2026 లో పార్లమెంట్ శాసనసభ నియోజకవర్గాల పెంపు జరుగుతుంది కాబట్టి సీట్ల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండదని , కూటమి పార్టీలకు సీట్ల మధ్య ఎటువంటి విభేదాలు ఉండవని ముఖ్యమైన నేతలు అందరికీ సీట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.

పుష్ప 2 లో జగన్ డైలాగ్... ఫుల్ సపోర్ట్ ఇస్తున్న వైసీపీ ఫ్యాన్స్?
Advertisement

తాజా వార్తలు