News Round up: న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు : రాజగోపాల్ రెడ్డి

ఈసీ ఇచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

తన కుమారుడికి చెందిన సుశి ఇన్ఫ్రా తో తనకు సంబంధం లేదని, రూ.5 కోట్ల 24 లక్షలతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

2.కేటీఆర్ కు షర్మిల సూచన

  మునుగోడు ను దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ టిపి అభినేత్రి షర్మిల సూచించారు. 

3.జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత

 

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది.రోడ్ నెంబర్ 71 లో థార్ కార్ లో తరలిస్తున్న 82.92 వేల నగదును జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 

4.నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళన

  హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ చౌరస్తాలో నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 

5.రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

 

తెలంగాణ సమాజానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఫామ్ హౌస్ కే పరిమితం అయిందని విమర్శించారు. 

6.  రాహుల్ పాదయాత్రకు విరామం

  ఎఐసిసి నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.కొత్తూరు వద్ద పాదయాత్రకు విరామం ప్రకటించారు. 

7.జుల్నా తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

 

Advertisement

దక్షిణ మధ్య మరార్వాడ నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలు ను ప్రవేశపెట్టింది. 

8.ఆన్లైన్ సేవల విస్త్రరణ

  విద్యుత్ బిల్లులో పేరు మార్చుకునే ప్రక్రియను సులభతరం చేసి ఆన్లైన్ సేవలకు విస్తరణ పై టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 

9.ధరల సవరణకు రిటైర్డ్ జడ్జితో కమిటీ

 

హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు త్వరలో పెరగనున్నాయి.ప్రస్తుతం ఉన్న చార్జీలను సవరించడానికి రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. 

10.కెసిఆర్ కు లిక్కర్ స్కాం భయం

  లిక్కర్ స్కాం వెలుగులోకి రాగానే ఆ భయంతో తెలంగాణలోకి సిబిఐ రాకుండా సీఎం కేసీఆర్ జీవో 51 విడుదల చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

11.మోదీ, అమిత్ షా దేశ ద్రోహులు

 

 ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు దేశద్రోహులని , బిజెపి ని ఈ దేశం నుంచి తరిమివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. 

12.వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

  వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. 

13.బీజేపీ టీఆర్ఎస్ పై రాహుల్ విమర్శలు

 

బిజెపి టిఆర్ఎస్ పార్టీలో దోచుకునే పనిలో ఉన్నాయని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు. 

13.శరద్ పవార్ కు అస్వస్థత

  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 

14.బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

 

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులు మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యాఖ్యానించడం పై క్షమపణ చెప్పాలని టీఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. 

15.చోడవరం లో విద్యార్థి భేరీ

 ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు సాగుతున్నాయి.తాజాగా చోడవరంలో విద్యార్థి పేరుతో భేరీ నిర్వహిస్తున్నారు.వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ రాజధాని కావాలని చోడవరంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 

16.బండి సంజయ్ మాటలు వెనక్కి తీసుకోవాలి

  బిజెపి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై అనేక విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ మండపడ్డారు.ఉదోగులు ఎవరికి అమ్ముడు పోలేదని బండి సంజయ్ ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. 

17.రాజమండ్రిలో కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం

  రాజమండ్రి మంజీర కన్వెన్షన్ హాల్లో వైసిపి కాపు ప్రజాప్రతినిధులు సమావేశం ప్రారంభమైంది. 

18.రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

 

Advertisement

బీజేపీ మునుగోడు అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.టిఆర్ఎస్ నేత సోము భరత్ ఫిర్యాదుతో ఈసీ నోటీసులు జారీ చేసింది. 

19.గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన 132 మందికి చేరిన మృతుల సంఖ్య

  గుజరాత్ లోని మూర్తిలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణాల సంఖ్య 132 కు చేరింది. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,600   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,840.

తాజా వార్తలు