న్యూస్ రౌండప్ టాప్ 20

1.రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు.సోనియా అత్యవసర భేటీ

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం రేగడంతో దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అత్యవసర సమావేశాన్ని పార్టీ నేతలతో ఏర్పాటు చేశారు.

 

2.కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

  వందల కోట్లతో నిర్మించబడిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది.ఆగస్టు 4న దీనిని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

3.రెండు లక్షల మందితో బిజెపి సభ

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో రెండు లక్షల మందితో బిజెపి సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. 

4.సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం

  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్ యూఐ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

5.పెరుగుతున్న గోదావరి

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. 

6.ఎలుగుబంట్ల కలకలం

  ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది.  పాలకుర్తి తొర్రూరు మండలాల్లో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

7.వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

 

Advertisement

తెలంగాణలోని వరద ముంపు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. 

8.లోకేష్ కామెంట్స్

  ఏపీలో పాఠశాలలు వీలైనంత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.టీచర్లపై కక్ష విద్యార్థులకు శిక్ష అన్నట్లుగా ఏపీలో తీరు ఉందని ఆయన మండిపడ్డారు. 

9.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

10.వాక్సిన్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం

  ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో , భారత్ లో కూడా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో వాక్సిన్ ల తయారీకి కేంద్రం ఆహ్వానించింది.ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు. 

11.స్పైస్ జెట్ పై 8 వారాల పాటు ఆంక్షలు

 

స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై కేంద్రం 8 వారాల పాటు ఆంక్షలు విధించింది.ఈ ఎనిమిది వారాలపాటు 50% మాత్రమే విమాన సర్వీసులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 

12.సుదీప్ కు రాజమౌళి అభినందనలు

  సుదీప్ రాజా 3డి చిత్రం విక్రాంత్ రోణ ను ఐదు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు.రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుండడంతో రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. 

13.పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

 

తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 

14.150 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు విఐపి దర్శనం

  తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు దాదాపు 15 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం వివాదంగా మారింది  

15.రఘురామ కృష్ణంరాజు కామెంట్స్

 

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అందరం పై తమలపాకు యుద్ధం చేస్తున్నామని ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు.తమ పార్టీ మూడేళ్ల నుంచి యుద్ధం చేస్తోందని యుద్ధం చేసే వాళ్ళు కనిపిస్తే కాళ్లు పట్టుకుంటారని రఘురామ విమర్శించారు. 

16.శ్రీవారి బ్రహ్మోత్సవం పై టీటీడీ కీలక నిర్ణయం

  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోండి బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులపాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

17.జగన్ పర్యటన పై బిజెపి కామెంట్స్

 

Advertisement

ఏపీ సీఎం జగన్ వరద పర్యటనకు వెళ్లారా లేక విహారయాత్రకు వెళ్లారు అంటూ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. 

18.మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ

  ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది.ఉద్యోగుల ఆరోగ్య పథకం మీద ఎక్కువ సమయం చర్చించారు. 

19.పోలవరం ప్రాజెక్టు పై కేంద్రమంత్రితో అంబటి రాంబాబు భేటీ

 

పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ తో ఏపీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.ఈ పర్యటనలో ఆయన వెంట ఎంపీ మిధున్ రెడ్డి మరో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,100   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,380.

తాజా వార్తలు