న్యూస్ రౌండప్ టాప్ 20

1.యూపీ సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

వారణాసి నుంచి బయలుదేరిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కొద్దిసేపటికే పోలీస్ లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

పక్షిని ఢీకొట్టడంతో నే ముందస్తు జాగ్రత్త చర్యగా వెనక్కి తీసుకు వచ్చినట్లు సమాచారం.

2.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు.

4.మానవ హక్కుల కమిషన్ కు బండి సంజయ్ ఫిర్యాదు

తెలంగాణలో రేషన్ కార్డులను రద్దు చేయడం,  కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

5.భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం

జయశంకర్ భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

6.సీజ్ చేసిన వాహనాల వేలం

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 821 వాహనాలను వేలం వేయనున్నట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

7.గొర్రెల స్కీమ్ పేరుతో 8 కోట్ల మోసం

గొర్రెల స్కీమ్ పేరుతో 8 కోట్ల మేర కూర్చోబెట్టారని ఆరోపణలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల కేంద్ర జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సర్జరీ శ్రీనివాసరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

8.30 న గోదావరి బోర్డు సబ్ కమిటీ సమావేశం

సీట్ నీతో పాటు ఆపరేషన్ ఫ్లో ఛార్ట్, 2022 - 23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై చర్చించడానికి వీలుగా గోదావరి నది యాజమాన్య కమిటీ సమావేశం 30 న జరగనుంది.

9.నాగబాబు కీలక వ్యాఖ్యలు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఏపీ ప్రభుత్వం పై జనసేన నాయకుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.అవినీతిపరులు,  దోపిడీదారుల నుంచి ఏపీని విముక్తి చేయడానికి భవిష్యత్తు తరాలను కాపాడుకోవడానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

10.టీటీడీ భక్తులకు శుభవార్త

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభ వార్త చెప్పింది ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

11.విశాఖ ఉక్కు ఉద్యమానికి 500 రోజులు

విశాఖ స్టీల్ క్రాంతి నువ్వు ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కార్మికులు ప్రజా సంఘాలు చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నేటితో 500 రోజులు పూర్తయ్యాయి.

12.సింహాద్రి అప్పన్న కు స్వర్ణ సంపెంగ పుష్ప అర్చన

విశాఖపట్నంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న కు స్వర్ణ సంపెంగ పుష్పార్చన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

13.నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

Advertisement

నేడు తెనాలి లు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు హాజరుకానున్నారు.

14.శ్రీశైలం లో పల్లకి సేవ

శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామివారి అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించనున్నారు.

15.బౌద్ధ మహ సదస్సు

విశాఖ అంబేద్కర్ భవన్ బౌద్ధ మహాసభ ను నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నారు.

16.ఇంద్ర కీలాద్రి దగ్గర పొగాకు అమ్మకం వినియోగం పై నిషేధం

ఈరోజు నుంచి ఇంద్రకీలాద్రి దగ్గర పొగాకు అమ్మకాలు వినియోగం పై నిషేధం విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

17.ఏపీలో బిజెపి ఉనికే లేదు

ఏపీలో బీజేపీ ఉనికే లేదని దీనికి తన గెలుపుపై నిదర్శనమని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

18.ముంబై పేలుళ్ల సూత్రధారి కి 15 ఏళ్ళ జైలు శిక్ష

లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ తీర్పు పాకిస్థాన్లోని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది.ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా సాజిద్ ఉన్నారు.

19.రౌడీ  షీటర్ల పై బహిష్కరణ వేటు

విజయవాడలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు నగర కమిషనర్ తెలిపారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,550 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,870.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు