న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఢిల్లీకి ఏపీ గవర్నర్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీకి చేరుకున్నారు.

  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు.ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ను ఆయన కలవనున్నారు.

2.వివేకా హత్య కేసు పై యనమాల కామెంట్స్

వైఎస్ హత్య కేసు పై టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా మృతి పై సిబిఐ సహకరించడం లేదని టిడిపి , గూగుల్ టెక్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని యనమల కామెంట్ చేశారు.

3.బుచ్చిబాబు కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు మరో 14 రోజులు జుడిషియల్ కస్టడీ న్యాయస్థానం పొడగించింది.

4.ఏప్రిల్ 5న గురు కృప యాత్ర

సిక్కుల పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏప్రిల్ 5న గురుకుల యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నదపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

5.నారాయణ నివాసంలో ఏపీ సిఐడి సోదాలు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

హైదరాబాదులో ఏపీ సిఐడి అధికారులు రెండో రోజు మాజీ మంత్రి నారాయణ నివాసంలో దాడులు నిర్వహిస్తున్నారు.

6.తిరుమల సమాచారం

నేడు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

7.ఎయిర్ ఇండియాలో నియామకాలు

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 5 వేల మందిని నియమించుకోనుంది.

8.షర్మిల కామెంట్స్

కెసిఆర్ ను మళ్లీ సీఎం ఎందుకు చేయాలి? రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసినందుకా అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

9.నేడు,రేపు మస్లిజ్ జాతీయ సదస్సు

జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడానికి ఆల్ ఇండియా ముస్లిజ్ ఇత్తే  హదుల్ ముస్లిమీన్ (మస్లిజ్) పార్టీ కార్యచరణను సిద్ధం చేస్తోంది.

10.ఐ ఎన్ టి యు సి సెక్రటరీగా భాస్కర్ రెడ్డి

ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ సెక్రటరీగా హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన  భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.

11.ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు

ఈ ఏడాది ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు చేశారు.

12.జస్టిస్ ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ పదవి విరమణ చేయడంతో హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.

13.నేవీలో తొలి ఎంసీఏ బర్జ్ జలప్రవేశం

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

యద్దనవకులకు అవసరమైన మిస్సయిళ్ళు, మందు గుండు సామాగ్రి తరలించేందుకు తయారు చేసిన తొలి  విశాఖపట్నంలో జలప్రవేశం చేయించారు.

14.ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి పెంపు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తూ ప్రభుత్వం సబర్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

15.పట్టాభి కస్టడీ పిటిషన్ తిరస్కరణ

Advertisement

గన్నవరం ఘర్షణలో అరెస్ట్ అయిన టిడిపి జాతి అధికార ప్రతినిధి  పట్టాభి కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.

16.నా కుమారుడు క్లీన్ గా వస్తాడు : ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో  లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని క్లీ,న్ గా బయటకు వస్తాడని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

17.మత వివక్షపై చట్టాన్ని తెస్తాం : కాంగ్రెస్

దేశంలో ద్వేషపూరిత నేరాల ము పరిష్కరించడానికి మత వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

18.ఎన్టీఆర్ కు టిడిపి అప్పగించాలి : కొడాలి నాని

ఎన్టీఆర్ కు పార్టీ ఇచ్చేసి చంద్రబాబు లోకేష్ తప్పుకోవాలని మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

19.కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు : బండి

ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

20.సిబిఐ ముందుకు మనిష్ సిసోడియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురుని సిబిఐ అరెస్టు చేసింది.

తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిషి సిసోడియాకు సిబిఐ సమన్లు జారీ చేసింది.

తాజా వార్తలు