న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

2.ఢిల్లీలో మంకీ ఫాక్స్ కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో మంకీ ఫాక్స్ కలకలం చోటుచేసుకుంది.ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు గుర్తించారు.

3.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,52,200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.ఏపీలో ఆగస్టు ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

ఏపీ ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

5.తెలంగాణలో కలపాలంటూ భారీ ధర్నా

తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చారు.

6.ఎల్లంపల్లి ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టుకు ఉన్న 23 గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

7.రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం

Advertisement

రేపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

8.అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు

ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మాత మహంకాళి ఆలయానికి పీవీ సింధు బోనంతో వెళ్లారు.అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

9.తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

10.ఫ్యాప్సీ నూతన అధ్యక్షుడిగా కరుణేంద్ర

ఫ్యాప్సి నూతన అధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కరుణేంద్ర నియమితులయ్యారు.

11.25 నుంచి బడి కోసం బస్సు యాత్ర

ఈ నెల 25 నుంచి బడి కోసం బస్సు యాత్ర పోస్టర్ ను పాఠశాల పరిరక్షణ వేదిక నాయకులు ఆవిష్కరించారు.

12.ఆహార పదార్థాలపై జిఎస్టి ఉపసంహరించుకోవాలి

ఆహార పదార్థాలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

13.రాష్ట్రపతి ప్రసంగం

నేడు జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు.

14.టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనలు

నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

15.వైన్ షాపుల బంద్

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నేడు, రేపు వైన్ షాపులు బంద్ చేయనున్నారు.

16.హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బోనాల సందర్భంగా హైదరాబాద్ లో నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.అంబర్ పేట, రామంతపూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

17.వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు , పి గన్నవరం నియోజకవర్గంలో జగన్ ఈ నెల 26 న  పర్యటించనున్నారు

18.నీరజ్ చోప్రా కు ప్రధాని అభినందనలు

టోక్యో ఒలంపిక్స్ లో రజత సాధించిన నీరజ్ సూపర్ నరేంద్ర మోది అభినందించారు.

19.అధికారులకు కేసీఆర్ సూచన

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారాలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -51,160 .

Advertisement

తాజా వార్తలు