రవితేజ బ్యూటీ సీబీఐ ఆఫీసర్ డాటర్ అని మీకు తెలుసా?

మాస్ రాజా రవితేజ ప్రెసెంట్ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

 Rajisha Vijayan Father Is A Cbi Officer Details, Ravi Teja, Ramarao On Duty, Sha-TeluguStop.com

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఇప్పటికే హోప్స్ పెంచేసింది.

జులై 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న రజిషా విజయన్ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

మొదటి నుండి కూడా ఈమె గురించి ఆరా తీయడం ఫ్యాన్స్ మొదలు పెట్టారు.అసలు రజిషా విజయన్ ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? అంటూ వరుసగా తమకు కావాల్సిన సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు.ఈమె ముందు యాంకర్ గా పని చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడంతో ఈమె ట్యాలెంట్ చూసి దర్శక నిర్మాతలు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.

Telugu Cbi, Karnan, Rajisha Vijayan, Ramarao Duty, Ravi Teja, Sharat Mandava-Mov

ముందు రజిషా విజయన్ మలయాళం సినిమాల్లో అవకాశం అందుకుంది అక్కడి నుండి తమిళ్ లో కూడా అడుగు పెట్టి ఏకంగా ధనుష్ నటించిన కర్ణన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా మంది దృష్టిలో పడింది.ఈ సినిమాలో ఈమె నటనకు అంతా ఫిదా అవ్వడంతో సూర్య జై భీమ్ లో కూడా కీలక పాత్రలో అవకాశం లభించింది.

Telugu Cbi, Karnan, Rajisha Vijayan, Ramarao Duty, Ravi Teja, Sharat Mandava-Mov

ఇక ఇప్పుడు మలయాళం, తమిళ్ లో వరుస అవకాశాలు అందుకుంటూనే మన టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది.ఈ క్రమంలోనే ఈమె ఫ్యామిలీ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈమె తండ్రి సిబిఐ లో పని చేసేవారని తెలిపింది.ఈ విషయం తెలిసి అందరు అవాక్కవుతున్నారు.మరి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube