న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఒలంపిక్ సంఘం ఎన్నికలు

రేపు కడప ప్రెస్ క్లబ్ లో జిల్లా ఒలంపిక్ సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

2.ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వైసీపీ నెల్లూరు నేతలతో క్యాంపు కార్యాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

3.పాదయాత్రకు నారా లోకేష్ విరామం

శివరాత్రి సందర్భంగా తన పాదయాత్రకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరామం ప్రకటించారు.

4.పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

5.గిల్డ్ మాఫియా వల్లే పరిశ్రమ నాశనం అవుతోంది

గిల్డ్ మాఫియా వల్లే పరిశ్రమ నాశనం అవుతుంది అని సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపించారు.

6.ఢిల్లీ లిక్కర్ స్కాం

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం లో మనిష్ సిసోడియా కు  సిబిఐ మళ్లీ సమన్లు జారీ చేసింది.

7.సజ్జల రామకృష్ణారెడ్డి పై శ్రీధర్ రెడ్డి కామెంట్స్

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ చేశారు.

8.పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్

మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు సందర్భంగా వన దుర్గామాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.

9.నటి గీత సింగ్ కుమారుడి మృతి

టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతా సింగ్ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

గీతా సింకు పెళ్లి కాకపోయినా , తన అన్న కుమారులని ఆమె దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు.  కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ పెద్ద కుమారుడు మృతి చెందారు.

10.కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జి పై కేసు

కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పై మరో కేసు నమోదు అయింది.చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుమీద అర్థనగ్నంగా బైఠాయించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు

11.అచ్చెన్న నాయుడు కామెంట్స్

టిడిపి నేత మాజీ మంత్రి జవహర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

12.కొనసాగుతున్న ఐటి దాడులు

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అంపాల్ ఆదిత్య రామ్ సహా 4 రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

13.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

14.మల్లారెడ్డి పై చర్యలు తీసుకోండి

Advertisement

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మంత్రి మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కోరారు.

15.కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా : ఎర్రబెల్లి

తాను ఒక్క ఎకరం కబ్జా చేసినట్లయితే నిరూపిస్తే తన మంత్రి పదవి రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

16.ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

రెండో విడతల గొర్రెలు పంపిణీ ఏప్రిల్ నుంచి చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

17.బిజెపి ఎంపీ అరవింద్ కు ఊరట

సీఎం ను కించపరిచారు అంటూ దాక లైన కేసులో హైకోర్టులో బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తరఫున ఊరట లభించింది.

18.బాన్సువాడ ఆసుపత్రికి జాతీయ గుర్తింపు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి జాతీయ గుర్తింపు దక్కింది.తల్లిపాలను ప్రోత్సహించే ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పటల్ ఇనిషియేటివ్ అందించే బెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ లభించింది.

19.15 నుంచి ఒంటి పూట బడులు

మార్చి 15వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు చేయనున్నారు.

20.శనగ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెనగ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముతోల్ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు