న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీటీడీపీ బస్సు యాత్ర

తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే బస్సు యాత్రలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటారు.

2.కిషన్ రెడ్డి విమర్శలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున వేలం వేస్తూ ప్రైవేట్ సంస్థలకు దార దత్తం చేస్తుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

3.పోలీసులకు హారతి ఇచ్చిన షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటూ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా, ఆమె పోలీసుల తీరుకు నిరసనగా వారికి హారతి ఇచ్చి నిరసన తెలిపారు.

4.సర్దార్ పాపన్న జయంతి వేడుకలు

ఢిల్లీ తెలంగాణ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు నిర్వహించారు.

5.తెలంగాణకు భారీ వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది .ఈ ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఉత్తర ఒరిస్సా , ఉత్తర ఛత్తీస్ ఘడ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో తెలంగాణలోని 16 జిల్లాలకు భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

6.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేటి స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

7.రేషన్ కార్డులు జారిపై అవాస్తవ ప్రచారం నమ్మవద్దు

Advertisement

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని , కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవాలంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు .అటువంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మువద్దని మంత్రి సూచించారు.

8.ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహం

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై త్వరలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

9.కేంద్రంపై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ పడుతోంది అంటూ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

10.నాగం క్లారిటీ

కాంగ్రెస్ లోనే తాను ఉన్నానని , ఇకపై ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

11.లోకేష్ విమర్శలు

తాను పోరాటం చేస్తున్నానని, ఓ పెత్తందారు వైసిపి గ్లోబల్ ప్రచారంపై పోరాటం చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

12.కెసిఆర్ కు రేవంత్ సవాల్

కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వెళ్తానని , ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు కెసిఆర్ సెక్యూరిటీ లేకుండా రాగలరా అంటూ రేవంత్ సవాల్ చేశారు.

13.అమలాపురంలో చంద్రబాబు ప్రజా వేదిక

టిడిపి అధినేత చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా వేదిక నిర్వహించారు.

14.ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

15.పోసాని కృష్ణ మురళి పై లోకేష్ పరువు నష్టం దావా

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

వైసిపి నాయకుడు , ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు.ఈ మేరకు మంగళగిరి కోర్టుకు లోకేష్ హాజరయ్యారు.

16.జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై జనసేన పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.జగన్ రాజకీయ నాయకుడు కాదు వ్యాపారి అంటూ పవన్ మండిపడ్డారు.

17.మావోయిస్టు అగ్రనేత మృతి

Advertisement

మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి కన్నుమూశారు.

18.వైసీపీని వీడుతున్నా : యర్లగడ్డ వెంకట్రావు

వైసిపి వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు.టిడిపిలో చేరేందుకు ఆయన ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని తెలిపారు.

19.బోనులో చిక్కిన ఎలుగుబంటి

శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున పట్టుకున్నారు

20.పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు కామెంట్ చేశారు.ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని అందులో సందేహం లేదంటూ విష్ణు వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు