News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కాలేజీ విద్యార్థులకు అల్పాహారం

 

తమిళనాడులోని పళని, దండయుదపాని ప్రముఖ దేవాలయ పరిధిలోని కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.

 

2.పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి

  పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. 

3.ఢిల్లీ మద్యం స్కాం విచారణ వేగవంతం చేసిన ఈడి

 

ఢిల్లీ మద్యం స్కాం లో ఈడి వేగం పెంచుతోంది.ఢిల్లీ మద్యం పాలసీ రూపు కల్పన సమయంలో ఢిల్లీ ఏపీ తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడి అధికారులు విచారణ చేస్తున్నారు. 

4.రేపు మధురై నుంచి భారత్ గౌరవ్ రైలు

  మధురై జంక్షన్ నుంచి ఈనెల 18వ తేదీ న భారత్ గౌరవ్ రైలు వారణాసి బయలుదేరనుంది. 

5.రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రంజిత్ సావర్కర్ ఫిర్యాదు

 

భారత్ జోడోయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పై మహారాష్ట్రలో తాజాగా మరో ఫిర్యాదు అందింది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరు సావర్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వినాయక దామోదర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

6.నిమ్స్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

  నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.1571 కోట్లతో నిమ్స్ ఆసుపత్రిని మరింత విస్తరించడానికి పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

7.వేరువేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు

 

Advertisement

ప్రయాణికుల రద్దీ మేరకు వేరువేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

8.భ్రమరాంబిక మల్లికార్జున ఆలయ ఆర్జిత సేవలో మార్పులు

 శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయ ఆర్జిత సేవలో అధికారులు మార్పులు చేశారు.ఈనెల 23 వరకు సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. 

9.హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ భూ ప్రకంపనాలు

 

హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం రాత్రి మళ్లీ భూకంపం సంభవించింది.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి, కాంగ్రెస్ పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రెక్టార్ స్కేలు పై 4.1 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలజి తెలిపింది. 

10.అరబిందో ప్లాంట్ కు యు ఎస్ ఎఫ్ డి ఏ ఆమోదం

  అరబిందో ఫార్మా కు చెందిన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పైడి భీమవరం ప్లాంట్ యూఎస్ఎఫ్డిఏ తనిఖీలు ముగించినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. 

11.లుప్తాన్స కార్గో సేవలు మళ్లీ ప్రారంభం

 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లుప్తాన్సా మళ్లీ కార్గో సేవలను ప్రారంభించింది. 

12.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

  ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్ ను పట్టించుకునే వారే లేరని, ఇక ఆయన కుమార్తెను ఎవరు చేర్చుకుంటారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేశారు. 

13.అచ్చెన్న నాయుడు కామెంట్స్

 

సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేతలపై ఆక్రమణ కేసులు నమోదు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు. 

14.మద్దతు ధరపై టిడిపి కామెంట్స్

  రొయ్యల మేత కంపెనీల నుంచి కమిషన్లు దండుకోవడంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో లేదని టిడిపి నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు.100 కౌంట్ ఉన్న రొయ్యల మద్దతు ధర ప్రభుత్వం కిలో 240 అని ప్రకటించింది అని, రేటు పడిపోతే మధ్యలో ఉన్న తేడాను భర్తీ చేయాల్సింది పోయి మద్దతు ధరను 210 కి తగ్గించిందని నెహ్రూ మండిపడ్డారు. 

15.జగన్ పై చంద్రబాబు మండిపాటు

 

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా ? రోడ్ల గుంతల్లో గుప్పెడు మట్టి వేయని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతాను అంటే ఎలా నమ్మాలి అంటూ టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. 

16.ఓబీసీలకు మోది ఏం చేసిండు

  బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గత 8 ఏళ్లలో ఓబీసీలకు ఏం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. 

17.అస్తవ్యస్తంగా రెవెన్యూ వ్యవస్థ : కోదండ రెడ్డి

 

Advertisement

 తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ఆస్తవ్యస్తంగా మారిందని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శించారు. 

18.అమరావతి రైతుల లీవ్ పిటిషన్లు కొట్టివేత

 అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 లో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలి అంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో,  ఆ తీర్పును సవాల్ చేస్తూ అమరావతి రైతులు అప్పిళ్లు దాఖలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి అమరావతి రైతు సమాఖ్య దాఖలు చేసిన లీవ్ పిటీషన్లతో పాటు ప్రధాన అప్పిళ్లు కొట్టివేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. 

19.పోలవరం పై ఒత్తిడి చేయం

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించడం లేదని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

20.సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం

  సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని అప్పుడే రాష్ట్రం దేశంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు.

తాజా వార్తలు