న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ : కోమటిరెడ్డి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని కాంగ్రెస్ భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు.

2.లోకేష్ పాదయాత్ర

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 19 వ రోజుకి చేరుకుంది.

3.అఫ్సర్ భద్రతతో తుంగభద్ర కు ముప్పు

అఫ్సర్ భద్ర తో తుంగభద్ర కు ముప్పు ఉందని, అఫ్సర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే తుంగభద్ర జలాశయానికి నీటి చేరిక ప్రశ్నార్ధకంగా మారుతుందని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

4.వైసిపి ప్రభుత్వంపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్

వైసిపి ప్రభుత్వం పై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు.అమరావతి రైతులు ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదని , ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అని కృష్ణ కుమార్ రాజు మండిపడ్డారు.

5.రేవంత్ పాదయాత్రలో విహెచ్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్   పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు.

6.ఆక్రమణల కూల్చివేత

మాసబ్ ట్యాంక్ లో

ఆక్రమణలు కూల్చివేత కొనసాగుతోంది.జిహెచ్ఎంసి పార్కు స్థలాన్ని ఆక్రమించి వెలిసిన నిర్మాణాలను బల్లియా అధికారులు కూల్చివేస్తున్నారు.

7.ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ

ఏపీ సిఐడి మాజీ డిజిపి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

8.ఆ వాహనాన్ని తగులు పెడతా : రాజా సింగ్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఫైర్ అవుతున్నారు.కొత్త వాహనం కాకపోయినా,  కనీసం కండిషన్ లో ఉన్న వాహనం ఇవ్వాలని,  పాత వాహనాన్ని తనకు అంటగడితే ప్రగతి భవన్ వద్ద ఆ వాహనాన్ని తగులు పెడతానని రాజసింగ్ హెచ్చరించారు.

9.హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

యాత్రకు తెలంగాణ రాష్ట్ర హౌస్ కమిటీ ద్వారా వెళ్లే వారి కోసం ఆన్లైన్ అప్లికేషన్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర హౌజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీముద్దిన్ , ఈవో షఫీ ఉల్లా తో కలిసి ఆయన ప్రారంభించారు.

10.బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయం పై ఐటీ దాడులు జరిగాయి.అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

11.కేసీఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు అనుకూలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు.కేసీఆర్ ఇంకా ఈటల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని విమర్శించారు.

12.టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన జగన్

ఏపీలో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

13.తెలంగాణ బిజెపి  ఎం ఎల్ సీ అభ్యర్థి ప్రకటన

తెలంగాణ బీజేపీ ఎం ఎల్ సీ అభ్యర్ధిగా వెంకట నారాయణ రెడ్డి పేరును ప్రకటించింది.

14.బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రకటన

బీజేపీ జనసేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాధవ్ ను ప్రకటించారు.15.కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు సరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఆయా మార్కెట్లలో శాఖాహారంతో పాటు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

16.ఆదాని వ్యవహారంపై అమిత్ షా కామెంట్స్

అధాని గ్రూప్స్ పై  హిండేన్ బర్గ్ నివేదిక దేశ రాజకీయాలో సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో  దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.దీంట్లో దాచడానికి , భయపడడానికి ఏమీ లేదని అమిత్ షా అన్నారు.

17.కొడాలి నాని కామెంట్స్

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

వైఎస్ వివేకానంద రెడ్డి  ఆయన కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచి జగన్ ను సర్వనాశనం చేయాలని చూశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.

18.ఇసుక అక్రమ రవాణా ను నిరూపిస్తా

పెన్నా నదులు ఇసుక అక్రమ రవాణా ను నిరూపిస్తానని, నిరూపించలేక పోతే ఊరు నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

19.ఎమ్మార్పీఎస్ హైవే దిగ్బంధం

ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన విజయవాడ హైదరాబాద్ హైవే దిగ్బంధం  ఉద్రిక్తతకు దారి తీసింది.

20.ఈరోజు బంగారం ధరలు

Advertisement

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,400

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -57,160

తాజా వార్తలు