న్యూస్ రౌండప్ టాప్ 20

1.  శ్రీవారి సేవలో గాలి జనర్డహన్ రెడ్డి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

కర్ణాటకలో ప్రముఖ రాజకీయ నేత మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఈరోజు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు.

2.కాంగ్రెస్ సభా పక్ష నేత రాజీనామా

మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలసాహెబ్ తోరట్ ఈరోజు ఆ పదవికి రాజీనామా చేశారు.

3.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది.

4 గుడివాడ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

గుడివాడ టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్లు అరెస్ట్ అయ్యారు.అధికారుల విధులకు ఆటం కలిగించారంటూ ఆయనపై సెక్షన్ 341, 353 రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేశారు.

5.పెరగనున్న రైళ్ల వేగం

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

 చెన్నై - రేణిగుంట, అరక్కోణం - జోలార్ పేట మార్గంలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

6.తెలంగాణ బడ్జెట్ పై సంజయ్ కామెంట్స్

తెలంగాణ బడ్జెట్ చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

7.శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol
Advertisement

మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి జంట నగరాల నగరాల నుంచి 390 ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

8.కందుకూరు గుంటూరు ఘటనపై విచారణ

చంద్రబాబు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై శేష సేయన రెడ్డి విచారణ  చేపట్టారు.

9.రేవంత్ నీ పార్టీని కాపాడుకో

సమ్మక్క సారలమ్మ, మేడారం అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

10.హరిరామ జోగయ్య కు మంత్రి అమర్నాథ్ లేఖ

వంగవీటి రంగా ను చంపించింది చంద్రబాబే అని చెప్పిన మీరు టీడీపీ తో జనసేన పొత్తు ను ఎలా సమర్దిస్తున్నారని మంత్రి అమర్నాథ్ లేఖలో ప్రశ్నించారు.

11.దమ్ముంటే రాజీనామా చెయ్

తన అనుచరులను కాదు దమ్ముంటే తనని సస్పెండ్ చేయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు.దమ్ముంటే పొంగులేటి రాజీనామా చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు.

12.స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ సమావేశం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం అయింది.

13.రాయలసీమ మేధావుల ఫోరం సమావేశం

తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం సమావేశం అయింది .తుంగభద్ర నదిపై అప్సర్ భద్ర ప్రాజెక్ట్ ను వెంటనే నిలిపివేయాలని సమాజంలో తీర్మానించారు.

14.జగన్ ను కలిసిన చెస్ క్రీడాకారిణి

ఏపీ సీఎం జగన్ ను చెస్ క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు.

15.పర్వతారోహకురాలోకి జగన్ నగదు ప్రోత్సాహం

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసిన పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ను జగన్ అభినందించారు.ఈ సందర్భంగా ఆమెకు పది లక్షల నగదు ప్రోత్సాహం అందించారు .

16.కేంద్రంపై వైసీపీ ఎంపీల మండిపాటు

రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతుందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు.

17.  పొన్నం  ప్రభాకర్ కామెంట్స్

Advertisement

బీఆర్ ఎస్ పెట్టి తెలంగాణ ఆస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

18.కేటీఆర్ కు రఘునందన్ రావు సవాల్

ITIR ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.

19.ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం ఈనెల 10 నుంచి ప్రారంభం కావల్సి ఉన్న పరీక్షలను సిలబస్ పూర్తికానందున వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ తెలిపారు.

20.ఆధార్ క్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటినుంచి పదవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

21.జి 20 సమ్మిట్

అనంతపురం జిల్లా లేపాక్షి లో జీ .20 సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు.

22.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,550.

తాజా వార్తలు