న్యూస్ రౌండప్ టాప్ 20

1.గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పి శ్వేతా రెడ్డి హెచ్చరించారు.

 

2.బీఈడీ ప్రవేశ పరీక్షల్లో సమూల మార్పులు

  తెలంగాణ వ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( బీఈడీ) కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఎడ్ సెట్ 21 లో సమూల మార్పులు చేసినట్లు కాకతీయ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ తాడికొండ రమేష్ తెలిపారు. 

3.ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు

  ఎస్సీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 15 వరకు గడువు పెంచినట్లు ఏపీ ఎస్ సి గురుకుల సొసైటీ కార్యదర్శి నవ్య తెలిపారు. 

4.బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రేవంత్

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రానున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్  నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీరావును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 

5.ఈనెల 25 ఆగస్టు 19 ఆర్మీ రాత పరీక్షలు

  సికింద్రాబాద్ సైనిక నియామక ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే రాత పరీక్షల తేదీలను రక్షణశాఖ ఖరారు చేసింది. ఈనెల 25, ఆగస్టు 19న రాత పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. 

6.రేవంత్ ప్రమాణస్వీకారం క భారీ బైక్ ర్యాలీ

  తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా నియోజకవర్గం నుంచి 5000 బైక్ లతో భారీ ర్యాలీగా తరలివెళ్లారు ఉన్నట్లు ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మల్ రెడ్డి రామ్ రెడ్డి తెలిపారు. 

7.అసిస్టెంట్లు, టైపిస్ట్ దరఖాస్తుల్లో సవరణకు ఛాన్స్

  వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రకటించిన అసిస్టెంట్లు, టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆన్లైన్ అప్లికేషన్ లో పొరపాట్లను సరిదిద్దుకోవడం ఎందుకు టిఎస్పిఎస్సి అవకాశం కల్పించింది.ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. 

8.మిజోరం గవర్నర్ గా బీజెపీ నేత కంభంపాటి

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

  పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నిర్ణయించింది.మిజోరం గవర్నర్ గా బీ జె పీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. 

9.15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం : లోకేష్

  ఏపీ సీఎం జగన్ అవినీతి స్థాయికి అద్దం పట్టేలా 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం జరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 

10.కడప జిల్లాలో జగన్ పర్యటన

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold
Advertisement

  ఏపీ సీఎం జగన్ ఈనెల 8 9 తేదీలలో రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 

11.నేటి సాయంత్రం విజయవాడ కి పవన్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విజయవాడకు రానున్నది రేపు మంగళగిరి పార్టీ కార్యక్రమాల్లో వరుస సమావేశాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. 

12.అంతర్రాష్ట్ర జల వివాదం మా పరిధిలో లేదు : హైకోర్టు

   అంతర్ రాష్ట్రాల జల వివాదం పై విచారించే అధికారం సుప్రీంకోర్టుకు గాని తమ పరిధిలో లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది.కృష్ణా జలాల వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

13.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 18,290 మంది భక్తులు దర్శించుకున్నారు. 

14.సీఎం తో కుమారస్వామి భేటీ

  కర్ణాటక ముఖ్యమంత్రి యడియరప్ప ను జేడీఎస్ అగ్ర నేత , మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి భేటీ అయ్యారు. 

15.తప్పిపోయిన రష్యా విమానం

  28 మంది ప్రయాణికులు ఉన్న రష్యా విమానం మంగళవారం తప్పిపోయింది. 

16.మైసూర్ ప్యాలెస్ సందర్శన ప్రారంభం

  కోవిడ్ ఆంక్షలు సడలించిన అనంతరం మైసూర్ ప్యాలస్ వీక్షించేందుకు అవకాశం కల్పించారు. 

17.భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన జర్మనీ

  భారత్ తో పాటు, అనేక దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ప్రభుత్వం ఎత్తివేసింది. 

18.ఢిల్లీ లో భూకంపం

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?

  దేశ రాజధాని ఢిల్లీ లో భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై 3.7 గా తీవ్రత నమోదయ్యింది. 

19.రాంకీ కార్యాలయంలో ఐటీ దాడులు

  గచ్చిబౌలి లోని రాంకీ కార్యాలయంలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. 

20 ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర- 46,750   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,759.

Advertisement

తాజా వార్తలు