న్యూస్ రౌండప్ టాప్ 20

1.పీఆర్సీ పై కేసీఆర్ ప్రకటన

పి ఆర్ సి పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు.

ఉద్యోగస్తులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

2.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం రేపింది.

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు పాజిటివ్ గా తేలింది.శనివారం సభకు హాజరైన ఆయన బడ్జెట్ పై మాట్లాడారు.దీంతో సహచర ఎమ్మెల్సీలలో ఆందోళన నెలకొంది.

3.25న ఏపీ కేబినెట్ మీటింగ్

ఈ ఆర్థిక సంవత్సరం చివరి మంత్రిమండలి సమావేశం ఈనెల 25వ తేదీన జరుగనున్నట్టు సమాచారం.

4.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

6.భైంసా అల్లర్ల పై కొనసాగుతున్న పోలీసులు దర్యాప్తు

బైంసా అల్లర్ల పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఈ అల్లర్ల సందర్భంగా దాడులు , ఆస్తులను ధ్వంసం చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వారియర్ తెలిపారు.

7.కడియం ఆరోపణలకు ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కౌంటర్

మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపణలకు  ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.తనకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణను చూసి కడియం శ్రీహరి ఓర్వలేకపోతున్నరు అని, ఈ వ్యవహారాలన్నీ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటాను అని రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

8.విచారణకు హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేడు హాజరయ్యారు.

9.ఏసీబీ డీఎస్పీ పేరుతో మోసం

కృష్ణ జిల్లా ఏసీబీ డీఎస్పీ పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

ఇటీవల అవినీతి కేసులో పట్టుబడిన వ్యక్తికి డీఎస్పీ శరత్ బాబు పేరుతో లంచం డిమాండ్ చేశాడు.అతనికి రిమాండ్ లేకుండా చూస్తాను అని మూడు లక్షలు డిమాండ్ చేశాడు.

10.డీఎండీకే సంయుక్త కార్యదర్శి కి కరోనా

కరోనా లక్షణాలతో డిఎండీకే సంయుక్త కార్యదర్శి సుదీష్ ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిశ్చ పొందుతున్నారు.

11.సినీ నటుడు కార్తీక్ కు అస్వస్థత

తమిళ సినీ నటుడు కార్తీక్ అస్వస్థతకు గురయ్యారు.శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కార్తీక్ నిన్న అనారోగ్యానికి గురయ్యారు.

12 కోల్ కతా ఓటరుగా మిథున్ చక్రవర్తి

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ లో చేరిన మిథున్ చక్రవర్తి కోల్ కతా ఓటరుగా మారారు.త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నట్టు సమాచారం.

13.భారత్ లో కరోనా

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 951 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.డీజీపీ కి జగన్ అభినందనలు

జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీ తో పాటు,  అత్యుత్తమ పోలీసింగ్ లో 13 జాతీయ స్థాయి అవార్డుల పొందిన నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఏపీ సీఎం జగన్ అభినందించారు.

15.నటి కరాటే కల్యాణికి పితృ వియోగం

సినీ నటి కరాటే కల్యాణి తండ్రి మృదంగ విద్వాన్, హరికథ సామ్రాట్ గా పేరు పొందిన పడల రామదాసు (70) అనారోగ్యంతో చికిశ్చ పొందుతూ మృతి చెందారు.

16.శ్రీకాకుళం జిల్లాలో కారోనా సెకండ్ వేవ్

శ్రీకాకుళం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది.దీంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.

17.జలశక్తి అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

జలశక్తి అభియాన్ ప్రచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు.

18.ఢిల్లీ లో మరోసారి లాక్ డౌన్

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

19.సోషల్ మీడియాలో కి ట్రంప్ రీ ఎంట్రీ

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 43,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,800.

Advertisement

తాజా వార్తలు