న్యూస్ రౌండప్ టాప్ 20

1.జానారెడ్డిని సన్మానించిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చేరికల కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్మానించారు.

 

2.రుణ మాఫీ పై షర్మిల కామెంట్స్

 

తెలంగాణలో రుణమాఫీ చేసి ఉంటే రైతులు ఆత్మహత్యలు ఉండేవి కాదు అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై షర్మిల కామెంట్ చేశారు. 

3.ఓయూ ఇంజనీరింగ్ కళాశాలకు లక్ష డాలర్ల విరాళం

  ఓయూ లోని మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు ఓయూ విద్యార్థి టెల్గా గోపాలరావు లక్ష డాలర్ల విరాళం ప్రకటించారు. 

4.  నోటీసు ఇవ్వకుండా డెవలప్మెంట్ చార్జీలు విధించొద్దు

 

విద్యుత్ అనధికార లోడు కలిగి ఉన్నారని,  అనుమతించిన దానికంటే అధికంగా వాడుతున్నారు అన్న కారణాలతో డిస్కంలు ఏకపక్షంగా విధిస్తున్న డెవలప్మెంట్ చార్జీలను ఇకపై నోటీసు ఇవ్వకుండా విధించ వద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కం లను ఆదేశించింది. 

5.స్పోర్ట్స్ కోటా అమలు చేయండి

 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు స్పోర్ట్స్ కోట కింద 2 శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ టి ఎస్ పి ఎస్ఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర అధికారిక సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి వినతి పత్రాలు అందజేశారు. 

6.5 వేల కోట్లతో మెట్రో రెండో దశ

 

Advertisement

మెట్రో రైల్ రెండో దశ ను ఐదు వేల కోట్లతో విస్తరిస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్.వి ఎస్ రెడ్డి తెలిపారు. 

7.తెలంగాణ పై విషం చిమ్మొద్దు : గంగుల కమలాకర్

  తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి విమర్శించారు. 

8.కర్ణాటకలోనూ పోటీ చేస్తాం : కేజ్రీవాల్

 

కర్ణాటకలో నువ్వు పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 

9.ఏపీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు

  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

10.జి ఆర్ ఎంబి మీటింగ్ వాయిదా

 

గోదావరి నది యాజమాన్య బోర్డు ఏపీ ఇరిగేషన్ అధికారులు గైర్హాజరు కావడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. 

11.ధోని పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

  ధోని ఛాంపియన్ క్రికెటర్ అని,  అతను అసాధారణ ఫినిషర్ అని ప్రశంసిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

12.విదేశీ పర్యటనకు వెళ్లబోతున్న జగన్

 

ఏపీ సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మీట్ లో జగన్ పాల్గొననున్నారు. 

13.పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త

  ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసి ప్రకటన చేసింది. 

14.నేడు ఒంగోలులో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

నేడు ఒంగోలులో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నిధులను జగన్ జమ చేయనున్నారు. 

15.పల్లా శ్రీనివాస్ పాదయాత్ర

  నేడు గాజువాక నుంచి సింహాచలం వరకు మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ పాదయాత్ర చేపట్టారు పెంచిన విద్యుత్ ఆర్టీసీ చార్జీలు నిరసనగా పేరుతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. 

16.నేడు భారత ప్రధానితో బ్రిటన్ ప్రధాని భేటీ

 

Advertisement

నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ తో బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ సమావేశం కానున్నారు. 

17.సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ

  నేడు సోనియాగాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కానున్నారు ఎన్నికల వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ చర్చించనున్నారు. 

18.పాక్షికంగా రైళ్లు రద్దు

 

నేటి నుంచి గుంతకల్లు రైల్వే డివిజన్ లోని కదిరేపల్లి తిరుపతి మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా అధికారులు రద్దు చేశారు. 

19.చంద్రబాబు పై ఏపీ మంత్రి కామెంట్స్

  బిర్లా ఏపీ సీఎం జగన్ ఇద్దరు లంచ్ మీటింగ్ పెట్టుకున్నారు అని తెలిస్తే చంద్రబాబు గుండె ఆగిపోద్ది అంటూ .ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటర్లు వేశారు. 

20.చంద్రబాబు ఉన్మాదిలా మారారు : సజ్లల

 

టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్మాది లా మారారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు.

తాజా వార్తలు