ప్రభాస్ కు స్పెషల్ గా పుట్టినరోజు విషెస్ చెప్పిన దేవసేన!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సందడి చేస్తున్నారు.

అభిమానులు మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.ఇక ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ నటించే సినిమాల నుండి వచ్చే అప్డేట్ ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ఒక రేంజ్ లో సందడిగా ఉంది.ఒకవైపు సినిమాల అప్డేట్ లు మరొక వైపు సినీ తారలంతా కో స్టార్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.

ఆ సినీ తారల్లో అనుష్క శెట్టి కూడా ఉన్నారు.ప్రభాస్ తో సినిమాల్లో నటించడమే కాకుండా ప్రభాస్ కు మంచి స్నేహితురాలు కూడా.

Advertisement

అందుకే ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా అనుష్క స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది.ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని.

అలాగే తన సినిమాలన్నీ హిట్ అవవడమే కాకుండా అందరి హృదయాలను కూడా గెలుచుకోవాలని కోరుకుంటూ విషెస్ అందించింది.అంతేకాదు ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుష్క ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.దీంతో ఇటు అనుష్క అభిమానులు అటు ప్రభాస్ అభిమానులు సంతోష పడుతున్నారు.

ఇక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొక వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు.ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదే విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు