‘ఎన్టీఆర్‌’ అనుష్క.. అదిరిపోయే న్యూస్‌

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర వార్త వస్తూనే ఉంది.

దీపావళి సందర్బంగా ఈ చిత్రంలో సావిత్రి పాత్రను నిత్యామీనన్‌ పోషిస్తుందని ప్రకటించిన దర్శకుడు క్రిష్‌ ఆ ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేయడం జరిగింది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంకా పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు.రికార్డు స్థాయిలో ఈ చిత్రం అమ్ముడు పోతున్న నేపథ్యంలో ఇంకా ఈ చిత్రంలో స్టార్‌ కాస్ట్‌ ను పెంచేందుకు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

Anushka In Ntr Bio Pic As B Saroja Devi

తాజాగా ఈ చిత్రంలో అనుష్క కూడా ఉండబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో బి సరోజా దేవితో కలిసి నటించాడు.తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన బి సరోజా దేవి పాత్రను అనుష్కతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఎన్టీఆర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

నేడు అనుష్క పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆమెకు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ చిత్రంలో అనుష్క అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Anushka In Ntr Bio Pic As B Saroja Devi-‘ఎన్టీఆర్‌’ అ�
Anushka In Ntr Bio Pic As B Saroja Devi

ప్రస్తుతం ఎన్టీఆర్‌ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో చేస్తున్న విషయం తెల్సిందే.త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో యాత్ర నిర్వహించబోతున్నారు.ప్రస్తుతం సినిమా రెండు పార్ట్‌లకు సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ను సంక్రాంతికి, రెండవ పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ను రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.అనుష్క ఈ చిత్రంలో ఉంటే ‘ఎన్టీఆర్‌’ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు