మల్లా రెడ్డికి మ‌రో షాక్‌.. ఇలా అయితే ఎలా...!

కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి గురించి తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారుండరు.

తన మాటలతో అంతలా మాయ చేసే మల్లారెడ్డి ఒకప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా పేరు గాంచిన మల్కాజ్ గిరి ఎంపీగా ఉండేవారు.

కానీ తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మంత్రయ్యాక కూడా మల్లారెడ్డి చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వివాద స్పదం అవుతుంటాయి.తనకు చెందిన ఆస్పత్రికి కార్మికులు తప్పకుండా వెళ్లేలా చేస్తున్నారని తాజాగా మంత్రిపై ఆరోపణలు వచ్చాయి.

అంతే కాకుండా కొన్ని రోజుల క్రితం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.అంతే కాకుండా ఆయన ఏది చేసినా.

Advertisement
Another Shock To Malla Reddy How Come Mallareddy, Trs,latest News -మల్ల�

వివాదస్పదం అవుతూనే ఉంటుంది.ఇక ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇందుకోసం మంత్రి తన నియోజకవర్గ పరిధిలోని గౌడవెళ్లి గ్రామానికి వెళ్లారు.కాగా.

గౌడవెళ్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం విశేషం.ఈ కారణం చేతే మంత్రి గౌడవెళ్లి అభివృద్ధికి సరిగా నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ.

గ్రామస్తులు నిలదీశారు.అంతే కాకుండా గ్రామ సభ టీఆర్ఎస్ అధికార పార్టీ సభలా మారిపోయిందని విమర్శించారు.

Another Shock To Malla Reddy How Come Mallareddy, Trs,latest News
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇక అదే మండలంలోని ఎల్లంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొనగా.అక్కడి ప్రజాప్రతినిధులు కూడా రాకపోవడం గమనార్హం.10 మంది వార్డు సభ్యులున్న ఆ గ్రామంలో మంత్రి పర్యటన ఉందంటే కేవలం ఇద్దరంటే.ఇద్దరు వార్డు సభ్యులు మాత్రమే వచ్చారు.

Advertisement

మిగతా వార్డు సభ్యులు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా.

సర్పంచ్ వ్యవహార శైలి వల్లే తాము రాలేదని ఆ వార్డు మెంబర్లు చెప్పడం గమనార్హం.

తాజా వార్తలు