ఏలూరులో మరో దారుణం మహిళను గొంతు కోసి హత్య..!!

ఏలూరు జిల్లా( Eluru ) కేంద్రంలో వరుసగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి.

కొద్ది నెలల క్రితం దంత వైద్య కళాశాలలో పనిచేస్తున్న వివాహితపై యాసిడ్ దాడి చేయడం తెలిసింది.

ఈ ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇటీవల వారం రోజుల క్రితం ఏలూరు పట్టణం గణేష్ నగర్ లో మహిళ( woman )పై హరి అనే వ్యక్తి రాడ్డుతో దాడి చేయడం జరిగింది.

ఈ ఘటనలో గాయపడ్డ సదరు మహిళా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఏలూరు పట్టణం( Eluru )లో శనివారం పేటకు చెందిన ఉడత సుజాత అనే మహిళను ఆమె ప్రేమికుడు దిమ్మిటి సత్యనారాయణ స్వామి విచక్షణ రహితంగా గొంతు కోసి హత్య చేశాడు.

అనంతరం నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో సత్యనారాయణ స్వామి రైలు కిందపడి మృతి చెందడం జరిగింది.ఈ సంఘటన ఏలూరు నగరంలో సంచలనం కలిగించింది.

Advertisement

రక్తపు మడుగులో ఉడత సుజాత మృతదేహం ( Dead body )చూసి కుటుంబ సభ్యులు కన్నీరు అయ్యారు.ఏలూరు జిల్లా కేంద్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి.

జిల్లాల్లో పర్యటనలు.. అక్కడే నిద్ర ! ఆ సమయం వచ్చిందంటున్న జగన్ 
Advertisement

తాజా వార్తలు