ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా( AP Congress Chief ) బాధ్యతలు స్వీకరించిన తరువాత నుంచి షర్మిల( Sharmila ) చేస్తున్న రాజకీయం పై ఆ పార్టీ నేతల్లోనే గందరగోళం నెలకొంది.తన అన్న వైసీపీ అధినేత జగన్ ను( YS Jagan ) టార్గెట్ చేసుకునే షర్మిల విమర్శలు చేస్తూ ఉండడం, మిగతా అంశాలను పెద్దగా పట్టించుకోకపోవడం , పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే విషయంపై దృష్టి పెట్టకుండా తరచుగా జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉండడం పై కొంతమంది కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఏపీలోని ఎన్డీఏ కూటమి కంటే , జగన్ పైనే ఎక్కువగా షర్మిల చేస్తున్న విమర్శలు కారణంగా పార్టీకి పెద్దగా కలిసివచ్చేదేమి ఉండడం లేదని , పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విషయంలో షర్మిల పూర్తిగా విఫలమయ్యారని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు అందుతున్నారట.ఎన్నో తర్జనభర్జన ల తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించారు.

షర్మిల ద్వారా కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించడంతో పాటు, ఏపీలో అధికారంలోకి రావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావించినా, షర్మిల రాజకీయం మాత్రం రూటు మారినట్టుగా కనిపిస్తుండడం పైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.వ్యక్తిగత వివాదాలపైనే షర్మిల పదే పదే ప్రస్తావన చేయడం, జాతీయస్థాయిలో ఎన్డీఏ పైనే కాంగ్రెస్ పోరాటం చేస్తుండగా , ఏపీలో మాత్రం షర్మిల ఎన్డీఏ కూటమికి( NDA Alliance ) మద్దతుగా మాట్లాడుతూ, జగన్ ను టాబ్లెట్ చేసుకుంటున్నారని,

దీనివల్ల కాంగ్రెస్ కు ఓరిగేదేమీ లేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది .కాంగ్రెస్ ఏపీ బాధ్యతలను షర్మిల స్వీకరించిన సమయంలో, షర్మిలకు మద్దతుగా చాలామంది సీనియర్ నేతలు ఉండేవారు.కానీ ఇప్పుడు వారిలో చాలామంది దూరంగానే ఉంటున్నారు.
షర్మిల నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.షర్మిల ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు కారణంగా కాంగ్రెస్ కు మరిన్ని ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో జగన్ సహకారం కాంగ్రెస్ కు అవసరమైనా.
షర్మిల చేస్తున్న విమర్శల కారణంగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు జగన్ ఆసక్తి చూపించరు అనే భయమూ కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఉందట.ఈ నేపథ్యంలోని షర్మిలకు ఈ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు అధిష్టానం పెద్దలు సిద్ధం అవుతున్నారట.