Parliament Elections KCR : మరో రెండు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడంతో.

లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ప్రజలకు ఆరు గ్యారెంటీల హామీ( Congress 6 Guarantees )లు ప్రకటించి సరైన రీతిలో అమలు చేయడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు.ఇష్టానుసారమైన హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.

అడ్డగోలు పాలన చేస్తుందని విమర్శలు చేశారు.ఎట్టి పరిస్థితులలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ పార్టీలకు చెక్ పెట్టే విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

ఇటువంటి పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో( Parliament Elections ) కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలిపునిచ్చారు.కాంగ్రెస్ పాలన కంటే సమైక్య పాలనే బాగుంది అన్నట్టు తెలంగాణలో పరిస్థితి మారిందని కేసీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలలో బీఎస్పీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోవడం జరిగింది.

ఇదిలాఉండగా లోక్ సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థులను గురువారం కేసీఆర్ ప్రకటించారు.మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తారని తెలిపారు.

ఇప్పటికే 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

' హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 
Advertisement

తాజా వార్తలు