మాజీ మిస్ ఇండియాను మిస్సెస్ చేసుకునేందుకు భారీగా అప్పులు చేసిన భర్త!

మాజీ మిస్ ఇండియాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నేహా దుపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు అంగద్ బేడినీ 2018లో వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.

ఇలా ఎంతో సంతోషంగా వీరి జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో నటుడు అంగద్ బేడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వివాహం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.తాను నేహాను చూసినప్పుడు ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని భావించానని తెలిపారు.

అయితే అప్పటికే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.అలాగే తన బీఎండబ్ల్యూ కారులో తిరిగేది.

Advertisement
Angad Bedini Reveals That He Took Loan To Impress Actress Neha Dhupia For Marri

ఇలా తనని ఇంప్రెస్ చేయాలంటే తను కూడా తన రేంజ్ కి తగ్గట్టుగా ఉండాలని భావించి ప్రతి రూపాయి కూడా పెడుతూ ఒక కారు కొన్నానని ఇలా కూడపెట్టినది మాత్రమే కాకుండా కారు కోసం డబ్బు అప్పు కూడా చేశానని, ఈ మాజీ మిస్ ఇండియాని తన మిస్సెస్ గా చేసుకోవడం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని నటుడు తెలియజేశారు.

Angad Bedini Reveals That He Took Loan To Impress Actress Neha Dhupia For Marri

ఈ విధంగా ఈయన మాట్లాడిన అనంతరం నేహా మాట్లాడుతూ.‘నా ప్రేమకి కారుతో సంబంధం లేదు.నేను వాగ్దానం చేయగలను.

లవ్‌కి ఏది అవసరం లేదు.సమయం వచ్చినప్పుడు అన్ని జరిగిపోతూ ఉంటాయ్.

అని ఈ సందర్భంగా నేహ దూపియా వెల్లడించారు.అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ మాత్రం డబ్బు ఖర్చు చేయవచ్చని నటుడు ఈ సందర్భంగా తెలియజేశారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు