అకౌంట్ నెంబర్ ఇస్తా.. 1000 పంపు అంటున్న యాంకర్ సుమ..!

తెలుగు బుల్లితెర పై అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తి ఎవరు అంటే అందరూ చెప్పే సమాధానం ఒకటే.అదే యాంకర్ సుమ అనే పేరు.

బుల్లితెరపై తనకు ఎదురు లేకుండా తన పాపులారిటీ అమాంతం పెంచుకున్న యాంకర్ ఈవిడ.సినిమాలతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టి ఆ తరువాత రాజీవ్ కనకాల ని వివాహం చేసుకొని ఆపై తెలుగు యాంకర్ గా తన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంది.

తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంతమంది యాంకర్స్ వచ్చినా సరే యాంకర్ సుమ ను మాత్రం వారు క్రాస్ చేయలేకపోతున్నారు.ఎవరైనా సరే సుమ ను అక్క అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆమెను అభిమానిస్తున్నారు.

యాంకర్ సుమ కూడా ఆమెను అభిమానించే వారిపై కూడా ఎంతో అభిమానంతో చూపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటూ సరదా సరదాగా వారితో డిస్కషన్ లో పాల్గొంటుంది.

Advertisement

ఇందులో భాగంగానే తాజాగా ఓ అభిమాని యాంకర్ సుమ ఉద్దేశించి ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు.దీనికి సమాధానంగా యాంకర్ సుమ సదరు అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చింది.

ఓ అభిమాని యాంకర్ సుమ ను ఉద్దేశించి.చూడండి సుమ గారు మీరు కచ్చితంగా నాకు రిప్లై ఇవ్వరు.

పందెం 1000 రూపాయలు అంటూ కామెంట్ చేశాడు.దీనిని గమనించిన యాంకర్ సుమ, ఇదిగో నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను రూ.1000 వేయి అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో ఇట్లే అర్థమైపోతుంది యాంకర్ సుమ అభిమానులతో ఎంత సరదాగా చిట్ చాట్ చేస్తుందో.

యాంకర్ సుమ కు ఎప్పుడు సమయం దొరికినా సరే తన అభిమానులతో మాట్లాడటానికి అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.మద్యమద్యలో ఇలా స్టార్ యాంకర్ కామెడీ చేసి అందరినీ నవ్విస్తూ ఉంటుంది.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు