రైతుల ఆందోళన: లండన్‌లో ఎన్ఆర్ఐల ర్యాలీ, 13 మంది అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్ని దిగ్భందించిన సంగతి తెలిసిందే.

వీరిని శాంతిపజేసేందుకు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది.

అయితే ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ప్రతీసారి చర్చలు విఫలమవుతూ వచ్చాయి.మరోవైపు రైతుల ఆందోళనకు మనదేశంలోని ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు లభిస్తోంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పటికే తన వైఖరి ఏంటో తెలియజేశారు.అలాగే అమెరికాలోని ప్రవాస భారతీయులు రైతులకు మద్ధతుగా ర్యాలీ నిర్వహించారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి యూకేలోని ఎన్ఆర్ఐలు వచ్చి చేరారు.ఆదివారం లండన్‌లో జరిగిన భారీ కిసాన్ ర్యాలీకి సంబంధించి 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

భారత సంతతి ప్రజలు, ప్రధానంగా సిక్కులు రైతులకు మద్ధతుగా భారత హై కమీషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) యూకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అటు ఫెడరేషన్ ఆఫ్ సిక్కు సంస్థలు నిర్వహించిన మరో కార్యక్రమంలో వందలాది కార్లు, ట్రక్కులతో ర్యాలీగా ఇండియన్ ఎంబసీ వైపుగా వెళ్లారు.

అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 13 మందిని మెట్రోపాలిటిన్ పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు భారత్‌లోని రైతుల ఆందోళనలకు బ్రిటన్ ఎంపీలు మద్ధతు పలికారు.భారత్‌ ప్రభుత్వంతో చర్చించి రైతుల ఆందోళన సమస్యను చర్చించాలని కోరుతూ 36 మంది బ్రిటిష్‌ ఎంపీలు బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాశారు.

వీరిలో భారత సంతతికి చెందిన వారు, పంజాబ్‌లో సంబంధాలున్నవారు ఉన్నారు.లేబర్ పార్టీకి చెందిన ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ ధేసీ సమన్వయంతో ఈ లేఖ రాసి అత్యవసరంగా సమావేశం కావాలని రాబ్‌కు సూచించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ లేఖపై సంతకం చేసిన వారిలో లేబర్, కన్జర్వేటివ్, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు