యాంకర్ రవి కూతురు మామూలుది కాదు.. అనసూయ పిన్ని అంటూ?

బుల్లితెర యాంకర్ రవి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో షోల్లో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతే కాకుండా పలు సినిమాలలో కూడా నటించాడు రవి.ఇక ప్రస్తుతం బుల్లితెరలో పలు షోలలో బాగా బిజీగా ఉన్నాడు.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు రవి.ఇక ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట్లో యాంకర్ రవి తన ఫ్యామిలీని ఎవరికీ పరిచయం చేయలేదు.

ఇక ఈ మధ్య తన ఫ్యామిలీని పరిచయం చేయడమే కాకుండా వారిని సోషల్ మీడియా వేదికగా మరింత పరిచయం చేశాడు.ఇక ఆయనకు వియా అనే కూతురు ఉంది.

ఇక తన కూతురుతో ఆడుతూ, పాడుతూ, అల్లరి చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా పంచుకుంటాడు. లాక్‌ డౌన్‌ సమయంలో షూటింగులు లేక ఇంట్లో ఉంటూ ఇంట్లో పని చేస్తూ, వంట చేస్తున్న వీడియోలను షేర్ చేయగా అవి బాగా క్లిక్ అయ్యాయి.

Anchor Ravis Daughter Says Anasuya Pinni Anchor Ravi, Viya, Anasuya, Social Medi
Advertisement
Anchor Ravis Daughter Says Anasuya Pinni Anchor Ravi, Viya, Anasuya, Social Medi

ఇక ఈ మధ్య తన కూతురు వియా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.అంతేకాకుండా తనకు సపరేట్ సోషల్ మీడియా ఖాతా, యూట్యూబ్ లో ప్రిన్సెస్ వియా ఛానల్ క్రియేట్ చేశాడు రవి.ఇక అందులో తన మాటలతో మంచి ఫాలోయింగ్ అందింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించింది ఈ గారాలపట్టి.

ఇక వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బాగా సందడి చేసింది.ఇక తనను ఓ నెటిజన్ మీ డాడీ కాకుండా యాంకర్స్ లో నచ్చిన వారు ఎవరు అని ప్రశ్నించగా అనసూయ పిన్ని అంటూ సమాధానం ఇచ్చింది.

ఇక మరో నెటిజన్ సుధీర్ మామ గురించి చెప్పమని ప్రశ్నించగా సుధీర్ మామ అందరికంటే ఎక్కువగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని నాన్న ఎప్పుడు చెబుతుంటేవాడని తెలిపింది.ఇక ఈ గారాలపట్టి మాటలకు నెటిజన్లు ఫిదా అవ్వగా.

మరికొందరు రవి కూతురు మామూలుది కాదు అంటూ ఏకంగా అనసూయనే పిన్ని అనేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు