Jhansi : ఆ పరిస్థితులలో నా కెరీర్ ని పూర్తిగా కోల్పోయాను : యాంకర్ ఝాన్సీ

టాలీవుడ్ లో పేరు గాంచిన యాంకర్స్ లలో ఝాన్సి( Jhansi ) కూడా ఒకరు.

ఆమె నటుడు జోగి నాయుడిని( jogi Naidu ) ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న సంగతి కూడా మనందరికి తెలిసిందే.

అయితే వీరి ప్రేమకు గుర్తుగా ఒక కూతురు కూడా జన్మించింది.ఆమె పేరు ధన్య.

కానీ వీరి పెళ్లి బందం చాలా తక్కువ రోజుల్లోనే బీటలు వారింది.దాంతో తనకు తన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టు కి వెళ్ళింది.

కొన్ని రోజుల పాటు వీరి మధ్య విడాకుల విషయంలో చాలా గొడవలు జరిగాయి.ఒకరిపై ఒకరు అనేక అలిగేషన్స్ చేసుకున్నారు.

Advertisement
Anchor Jhansi And Jogi Naidu Career Lost Due To Divorce-Jhansi : ఆ పరి�

ఫైనల్ గా ఝాన్సి తన భర్త నుంచి విడాకులు తీసుకొని కూతురితో విడిగా జీవించడం మొదలు పెట్టింది.

Anchor Jhansi And Jogi Naidu Career Lost Due To Divorce

అయితే ఝాన్సీ విడాకులు( Divorce ) తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా విడాకులు తీసుకున్న సందర్భంగా ఒక మాటలో చెప్పాలంటే ఆమె వైవాహిక జీవితమే ఆమె కెరియర్ కు యమ పాశంలా తయారయింది.పర్సనల్ లైఫ్ లో గొడవలు ఎక్కువ కావడం వల్ల ఎక్కువగా కెరియర్ పై ఫోకస్ చేయలేకపోయానని ఆ టైంలో విడాకులు అని కోర్టులు అని పోలీస్ స్టేషన్లో చుట్టూ వెళ్లడం వల్ల కొన్ని ఈవెంట్స్ చేజారిపోయాయని అందువల్ల ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనని యాంకరింగ్ చేయడానికి ఎవరు పిలవలేదని ఝాన్సీ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

అందుకే విడాకులు తన కెరియర్ ను పాడు చేసింది అంటూ ఝాన్సీ తన ఆవేదన వ్యక్తం చేసింది.

Anchor Jhansi And Jogi Naidu Career Lost Due To Divorce

ఇక ఇదే క్రమంలో జోగి నాయుడు కూడా తన కెరీర్ ను పూర్తిగా కోల్పోయాడు.భార్యతో గొడవల వల్ల కెరియర్ పై ఫోకస్ చేయలేకపోయాడు.ఆ మధ్యకాలంలో కాస్త వ్యసనాల బారిన కూడా పడ్డాడు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

సమాజం ఝాన్సి పై సానుభూతి చూపించి జోగి నాయుడు పట్ల మాత్రం నెగటివ్ భావాలను పెంచుకున్నారు.అందువల్లే సినిమాల్లో కానీ యాంకరింగ్ కానీ చేయలేకపోయానని తన కెరియర్ విడాకుల వల్లే ముగిసిపోయిందని ప్రస్తుతం మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక కూతురికి జన్మనిచ్చిన జోగి నాయుడు అనేక ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత జీవితం విషయాలను షేర్ చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు