చలాకి చంటికి అండగా వచ్చిన అనసూయ...

ప్రముఖ హాస్య నటుడు చలాకీ చంటి( Chalaki Chanti ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా( Heart Attack ) గుర్తించారు.అవసరమైన పరీక్షలు నిర్వహించి.

రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో వైద్యులు స్టంట్‌ వేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇక చంటి కి గుండెపోటు అని తెల్సి పలువురు జబర్డస్త్ కమెడియన్స్ , చంటి సన్నిహితులు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు .జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ ( Anasuya ) కూడా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించినట్టు తెలుస్తుంది .

Advertisement

అంతేకాక డాక్టర్స్ ని చంటి ఆరోగ్యం గురించి తెలుసుకొని .మెరుగైన చికిత్స అందించాలని కోరినట్టు సమాచారం .ప్రస్తుతం వీరిద్దరూ జబర్డస్త్ లో( Jabardasth ) లేకపోయినా .మంచి అనుబంధం ఉంది .అనసూయ జబర్డస్త్ ని వీడెప్పుడు చంటి భావోద్వేగానికి గురయ్యాడు.అప్పట్లో చలాకి చంటి మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమం కోసం నెలకు మూడు రోజుల కేటాయించలేవా అంటూ ఆమెను అడిగారు.

చంటి ఇలా అనడంతో అనసూయ కుదరదు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఎమోషనల్ అయ్యారు.ఇలాంటి అనుబంధం వారి మధ్య ఉంది .ఇక చంటి విషయానికి వస్తే .తొలినాళ్లలో మిమిక్రీ చేసిన చంటి, ఆ తర్వాత ఓ ఎఫ్‌ఎం రేడియోలో జాకీగానూ పని చేశారు.

ఆ తర్వాత జబర్దస్త్‌తో బుల్లితెరకు పరిచయమ్యారు.ఆ కార్యక్రమంతో ఆయన పేరు చలాకీ చంటిగా మారిపోయింది.అలాగే ‘నా షో నా ఇష్టం’ అనే కామెడీ షోను హోస్ట్‌ చేశారు.

బిగ్‌బాస్‌ 6 షోలో చంటి ఓ కంటెంస్టెంట్‌గా వెళ్లారు.ఓవైపు టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో హాస్య నటుడిగా కనిపించారు చంటి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

భీమిలి కబడ్డీ జట్టు, సినిమా చూపిస్త మావ లాంటి సినిమాల్లో తనదైన శైలి నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు.చంటి కి సువత్సలతో వివాహం అయింది .వీరికి ధన్యత అనే కుమార్తె ఉంది .ఇక చంటి త్వరగా కోలుకొని అందరికి నవ్వులు పంచాలని అభిమానులు కోరుతున్నారు .

Advertisement

తాజా వార్తలు