మేకప్ వేసుకున్నంత మాత్రాన హేళన చేస్తారా.. ట్రోల్స్ పై అనన్య కామెంట్స్!

మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.నటి అనన్య నాగళ్ళ( Ananya Nagalla ) .

ఇక ఈమె నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె త్వరలోనే పొట్టేల్( Pottel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Ananya Nagalla Sensational Comments Goes Viral In Social Media Details, Ananya,p

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి అనన్య మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఒక చిన్న సినిమాకు సందీప్ రెడ్డి( Sandeep Reddy ) గారి వంటి సపోర్ట్ రావడం అంటే మామూలు విషయం కాదు.ఈయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో సినిమా స్థాయి పూర్తిగా పెరిగిపోయిందని ఇలాంటి సినిమాలో మేము నటించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement
Ananya Nagalla Sensational Comments Goes Viral In Social Media Details, Ananya,P

ఇప్పటికే సినిమా చూసిన వారందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు.ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని తెలిపారు.

Ananya Nagalla Sensational Comments Goes Viral In Social Media Details, Ananya,p

ఇకపోతే ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమ సమయంలో ఒక లేడీ రిపోర్టర్ ఈమెను కమిట్మెంట్స్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు.ఇలా లేడీ రిపోర్టర్ తనని కమిట్మెంట్స్ గురించి ప్రశ్నించడంతో బాగా హర్ట్ అయిన అనన్య ప్రీ రిలీజ్ వేడుకలో పలు విషయాలను వెల్లడించారు.చాలామందికి మేకప్ వేసుకునే సెలబ్రిటీలు అంటే చులకన భావన ఉంటుంది మేము కూడా మీలాగా మనుషులమే.

మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది.మాకు కూడా ఒక మనసు ఉంటుంది.

మేకప్ వేసుకొని ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఏది పడితే అది మమ్మల్ని మాట్లాడటం మంచిది కాదు మాకు కూడా కాస్త గౌరవం ఇవ్వండి మేము మనుషులమే అంటూ వేదికపై అనన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు