మొసలిని పట్టుకోడానికి ట్రై చేసిన పెద్దాయన.. కొద్దిలో ప్రాణాపాయం తప్పింది..!

సింహాలు, పులులు, మోసళ్ల వంటి క్రూర మృగాలను పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కానీ కొందరు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు లేకుండా వట్టి చేతులతో వాటిని పట్టుకోడానికి ప్రయత్నిస్తుంటారు ఇదే వారి కొంప ముంచుతుంది.

ఒక్కోసారి ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటారు.మరికొందరు ఈ భూమ్మీద బతికే నూకలు ఉండి ఆ ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు.

అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.@NoCapFights ట్విట్టర్ ( Twitter )పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.36 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు 1 కోటి 63 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.33 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ముసలాయన రోడ్డు పక్కన కాలువలో ఉన్న మొసలి వద్దకు వెళ్లడం మనం చూడవచ్చు.అతడి చేతిలో బస్తా లాంటిది ఏదో ఉంది.దానిని మొసలి కళ్లపై వేశాడు.

Advertisement

అనంతరం తన రెండు కాళ్ళను మొసలికి అటు, ఇటు వేసి ముందుకు వెళుతూ దాని మూతి పట్టుకుందామని చూశాడు.మొదటగా తల మీద చేయి వేశాడు.

దీనిని గ్రహించిన మొసలి( Crocodile ) వెంటనే వెనక్కి తిరిగింది.తన పెద్ద నోరును తెరిచి సదరు ముసలాయనపై దాడి చేసింది.

ఆ వ్యక్తి వెంటనే కింద పడిపోయాడు.ఆ సమయంలో మొసలి చేతిని కొరికేసింది.

ఇది ఊహించని ఆ వ్యక్తి వెంటనే ఉలిక్కిపడ్డాడు.అది తన మెడని కొరికేయకుండా కాళ్లతో తన్నుతూ మొసలి పక్కకు వెళ్లేలా చేయగలిగాడు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

దాంతో ప్రాణాపాయం తప్పింది.కానీ అతడి మోచేతి ప్రాంతాల్లో మొసలి పంటి గాయాలు అయ్యాయి.

Advertisement

నిజానికి ఇది చాలా పెద్ద మొసలి.క్షణాల్లోనే అతడిని కరకర నమిలేసి తినేయగలదు.అయినా ముసలాయన కొంచెం కూడా భయపడకుండా దానిని పట్టుకునేందుకు ట్రై చేయడం నిజంగా అతడి ధైర్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

ఈ మొసలిని ఇలా కాకుండా వేరే విధంగా పట్టుకోడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది.ఎవరూ కూడా ఇలాంటి మూర్ఖత్వపు పనులు చేయకూడదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇది మొసలి కాదని, దాని లాగా కనిపించే ఒక ఆలిగేటర్ అని కొందరు పేర్కొన్నారు.అందుకే అది దూకుడుగా లేదని, అదే మొసలి అయి ఉంటే అతడిని ఇప్పటికే చంపేసి ఉండేదని మరికొందరు అన్నారు.

వీటి స్వభావాలు, ఆకారాలు వేరైనా ఇవి రెండు మనుషుల ప్రాణాలకు హాని తలపెట్టగలవు.

https://youtu.be/zw85IagnKu8

తాజా వార్తలు