ఓ ఆడబిడ్డను అన్నగా ఆదుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి జిల్లా:ఓ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000/-ఆర్థికసాయం అందించి తుంగతుర్తి ఎమ్మెల్యే డా.

గాదరి కిశోర్ కుమార్ ఆ కుటుంబాన్ని అన్నలాగా ఆదుకున్నారు.తుంగతుర్తి నియోజికవర్గ పరిధిలోని మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి చెందిన పిల్లలమర్రి వెంకటేష్ రాణి దంపతుల కుమార్తె జయ వివాహ వేడుకకు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ని ఆహ్వానించారు.వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వారి కుటుంబ పరిస్థితిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకొని చలించిపోయారు.ఆ పేదింటి ఆడబిడ్డ వివాహం ఖర్చుల కొరకు ఆయన తన వంతు సహాయంగా రూ.50,000/-(యాభై వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఎమ్మెల్యే మంచి మనసుకు కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Latest Yadadri Bhuvanagiri News