ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన

ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఘటన చోటుచేసుకుంది.

షెట్పల్లి సంగారెడ్డి గ్రామ శివారులో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్( Srikanth ) అనే వ్యక్తి సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు.

తన స్నేహితుడైన రాజును వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్ర యజమానికి చెందిన ఎయిర్ గన్( Air gun ) పనితీరును వివరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎయిర్ గన్ పేలి బుల్లెట్ రాజు వీపు భాగంలోకి దూసుకెళ్లింది.దీంతో రాజు( Raju ) వీపు భాగంలో తీవ్ర గాయమైంది.

వెంటనే గమనించిన శ్రీకాంత్ చికిత్స నిమిత్తం నాగిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.పరిస్థితి తీవ్రంగా ఉండడంతో స్థానికుల సహయంతో శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాదు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం రాజు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.వ్యవసాయ క్షేత్రానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, లింగంపేట,ఎల్లారెడ్డి ఎస్ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

అనంతరం శ్రీకాంత్ వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట్ ఎస్ఐ తెలిపారు.

వైరల్ వీడియో : యువతి పక్కన ఉండడంతో రెచ్చిపోయిన వృద్ధ కామాంధుడు..
Advertisement

తాజా వార్తలు