మహేష్ హీరోయిన్‌కు అబ్బాయి పుట్టాడట!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అందాల భామ అమృతా రావు గురించి అందరికీ తెలిసిందే.

ఆ సినిమాలో అమ్మడు పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక అతిథి సినిమాలో మహేష్ సరసన అమృతా రావు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఆమె వరుసబెట్టి సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఆ తరువాత అమృతా రావు ఎక్కువగా కనిపించనే లేదు.

అడపాదడపా బాలీవుడ్ చిత్రాల్లో అమృతా రావు కనిపించినా, పెద్దగా ఆమెకు గుర్తింపు తెచ్చిన పాత్రలు పడకపోవడంతో ఆమె కెరీర్ చాలా స్పీడుగా ఫేడవుట్ అయ్యింది.కాగా కొంతకాలం కిందట తన బాయ్‌ఫ్రెండ్ ఆర్‌జే అన్మోల్‌ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, తన పర్సనల్ లైఫ్ గురించిన విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు.

అయితే రీసెంట్‌గా తన గర్భం గురించి భర్తతో కలిసి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిన ఈ బ్యూటీ తాజాగా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారంటూ అమృతా రావు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

తెలుగులో ‘అతిథి’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో చివరిసారిగా ‘థాక్రే’ చిత్రంలో కనిపించింది.భర్తతో పాటు సంతోషకరంగా జీవిస్తున్న అమృతా రావు తన గర్భం గురించి కూడా తొమ్మిది నెలల వరకు గోప్యంగా ఉంచడంతో ఆమె అభిమానులు అవాక్కయ్యారు.

ఇక తమ అభిమాన హీరోయిన్‌కు మగబిడ్డ పుట్టడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అటు ఆర్‌జె అన్మోల్ కలర్స్ టీవీలో ఓ షోను హోస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అమృతా రావుకు మగబిడ్డ పుట్టాడనే వార్త ఇరువురి కుటుంబ సభ్యుల్లో ఆనందాలను తీసుకొచ్చిందని ఆమె భర్త సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు