అమెరికాలో పిల్లి ఇప్పుడు హై రేంజ్ సెలబ్రిటీ...అసలేం జరిగిందంటే..!!!

ఒక్కో సారి సుడి గట్టిగా తిరిగితే మూటలు మోసుకునే వ్యక్తి మిలీనియర్ కూడా అవుతాడు.

లక్కు ఉండాలే కానీ ఊహించని ఎన్నో పరిణామాలు మన కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి.

అలాంటి సందర్భమే ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకుంది.ఓ పెంపుడు పిల్లి ఒక్క సారిగా అమెరికాలో సెలబ్రిటీ అయ్యిపోయింది.

కేవలం ఒకే ఒక్క కారణం ఆ పిల్లిని పబ్లిక్ ఫిగర్ చేసేసింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.

అమెరికాకి చెందిన జెఫ్ఫీ అనే వ్యక్తి స్థానికంగా 14న్యూస్ లో వెదర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.ఎప్పటిలానే వెదర్ రిపోర్ట్ చదువుతున్నాడు ఈక్రమంలోనే ఒక్క సారిగా తాను రిపోర్ట్ చేస్తున్న సమయంలో తన పెంపుడు పిల్లి బెట్టి లైవ్ లోకి వచ్చేసింది.

Advertisement

దాంతో షో చూస్తున్న ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు.అంతేకాదు ఆ షో కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరుసటి రోజు అతడు ఒక్కడే రిపోర్ట్ చేస్తుండగా ప్రేక్షకులు పిల్లి గురించి వివరాలు అడగడం మొదలు పెట్టారు.

దాంతో న్యూస్ 14 యాజమాన్యం మరుసటి రోజునుంచీ బెట్టిని కూడా అతడితో పాటు లైవ్ లో ఉంచడం మొదలు పెట్టింది.అది చేసే చేష్టలు అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యిపోవడంతో ఊహించని విధంగా షోకి రేటింగ్ పెరిగిపోయింది.అప్పటి నుంచీ ఆ పిల్లి బెట్టి సూపర్ సెలబ్రిటీగా మారిపోయింది.

అంతేకాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చికుంది.దాంతో దాని పేరుమీద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాని అభిమానుల కోసం వీడియోలు షేర్ చేస్తున్నాడు జెఫ్ఫీ.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు