స‌ర‌స్వ‌తి ఆకు తింటే మేథ‌స్సు పెర‌గ‌డ‌మే కాదు ఈ లాభాలూ పొందొచ్చ‌ని మీకు తెలుసా?

స‌ర‌స్వ‌తి ఆకు.దీనిని చాలా మంది బ్రహ్మి ఆకు అని కూడా పిలుస్తుంటారు.

చిన్న పిల్ల‌ల‌కు త్వ‌ర‌గా మాట‌లు రావ‌డానికి, మేథ‌స్సు పెర‌గ‌డానికి స‌ర‌స్వ‌తి ఆకుతో త‌యారు చేసే లేహ్యంను తినిపిస్తుంటారు.అయితే ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉండే స‌ర‌స్వ‌తి ఆకు మేథ‌స్సును పెంచ‌డ‌మే కాదు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌నూ క‌లిగిస్తుంది.

మ‌రి ఆల‌స్యమెందుకు స‌ర‌స్వ‌తి ఆకుతో ఏయే ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చో ఓ చూపు చూసేయండి.ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డానికి స‌ర‌స్వ‌తి ఆకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

స‌ర‌స్వ‌తి ఆకుల నుంచి ర‌సం తీసి అందులో కొద్దిగా వాము క‌లిపి తీసుకుంటే గ‌నుక చెడు కొలెస్ట్రాల్ క్ర‌మంగా క‌రిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో వ‌న్ టేబుల్ స్పూన్ స‌ర‌స్వ‌తి ఆకు ర‌సం క‌లిపి తీసుకోవాలి.

Advertisement
Amazing Health Benefits Of Saraswathi Leaf ! Health, Benefits Of Saraswathi Aaku

ఇలా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.మెద‌డు చురుగ్గా, ఉత్సాహంగా ప‌ని చేస్తుంది.

మ‌రియు అల్జీమర్స్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.స‌ర‌స్వ‌తి ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

అందు వ‌ల్ల ప్ర‌తి రోజు ఒక‌టి లేదా రెండు స‌ర‌స్వ‌తి ఆకుల‌ను బాగా న‌మిలి తింటే.శ‌రీరంలో ఫ్రీ రాడికల్స్ అంత‌మై క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

Amazing Health Benefits Of Saraswathi Leaf Health, Benefits Of Saraswathi Aaku

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా స‌ర‌స్వ‌తి ఆకు ఒక దివ్యౌష‌ధమ‌ని చెప్పుకోవ‌చ్చు.సరస్వతి ఆకులను నీడలో ఎండ బెట్టి పొడి చేసుకుని.పావు స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇలా మ‌ధుమేహులు చేస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో ఎల్ల‌ప్పుడూ కంట్రోల్‌లో ఉంటాయి.ఇక స‌ర‌స్వ‌తి ఆకు ర‌సాన్ని త‌ర‌చూ తీసుకుంటే క‌డుపులో పుండ్లు త‌గ్గుతాయి.

Advertisement

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.మ‌రియు జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు సైతం పరార్ అవుతాయి.

తాజా వార్తలు