డయాబెటీస్‌కు చెక్ పెట్టే అరటిపువ్వు.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

అర‌టి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో.అర‌టి పువ్వు కూడా ఆరోగ్యానికి అంతే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అర‌టి పువ్వుతో ఎన్నో వంట‌లు చేస్తుంటున్నారు.ముఖ్యంగా మన భార‌తీయులు అర‌టి పువ్వు కూర‌, అర‌టి పువ్వు ప‌చ్చ‌డి, అర‌టి పువ్వు ఫ్రై, అర‌టి పువ్వు వ‌డ‌లు ఇలా ర‌క‌ర‌కాల ఐటెమ్స్ త‌యారు చేస్తుంటారు.

అయితే ఎలా చేసుకున్నా అర‌టి పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా డ‌యాబెటిస్ రోగుల‌కు అర‌టి పువ్వు ఓ ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.

వాస్త‌వానికి నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు.అయితే ఒక్క సారి డ‌యాబెటిస్ వ‌చ్చిదంటే.

Advertisement

జీవితాంతం ఉంటుంది.ఇలాంటి వారు స్వీట్స్, ఇత‌ర ఆహారం తినాలంటేనే.

ఎక్క‌డ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతోయో అని భ‌య‌ప‌డిపోతారు.అయితే డ‌యాబెటిస్ రోగులు అర‌టి పువ్వు కూర‌ను వారానికి ఒక సారి తీసుకుంటే.

రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయట.అలాగే అర‌టి పువ్వుతో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

అర‌టి పువ్వు కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాలు అభివృద్ధి చెంద‌డంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతంద‌ట‌.మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయ‌ని అంటున్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఇక అర‌టి పువ్వు లో ఉండే విట‌మిన్ సి.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతోంది.అరటి పువ్వులో ఐరన్ పుష్క‌లంగా ఉంటుంది.

Advertisement

కాబ‌ట్టి, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న వారు అర‌టి పువ్వును డైట్‌లో చేర్చుకుంటే.ర‌క్త‌వృద్ధి జ‌రుగుతుంది.

అలాగే అర‌టి పువ్వు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉండ‌డంతో పాటు.గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.

అర‌టి పువ్వు కూర‌ను వారానికి ఒకసారి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు