సత్యమూర్తి నో డౌట్‌

టాలీవుడ్‌ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’.

అల్లు అర్జున్‌ హీరోగా, సమంత ప్రథమ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ మరియు అదా శర్మలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇక ప్రమోషన్‌ కోసం అంటూ ఒక ప్రత్యేక పాటను తెరకెక్కిస్తున్నారు.

దాంతో సినిమాకు మరింత పబ్లిసిటీ రాబోతుంది.ఇక ఈ సినిమా విడుదల గురించి అనేక అనుమానాలు నిన్న మొన్నటి వరకు వచ్చాయి.

Advertisement

అయితే నేటితో ఆ అనుమానాలకు తెర పడ్డట్లయింది.నేడు సెన్సార్‌ ముందుకు ఈ సినిమా వెళ్లింది.

సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాకు నేడు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వబోతున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాకు యూ కాని యూ/ఎ కాని రావచ్చని ఆశిస్తున్నారు.

సెన్సార్‌ పూర్తి అవుతుంది కనుక ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే లేవని అంటున్నారు.వచ్చే నెల రెండవ వారంలో ఎప్పుడైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ బిజినెస్‌ అయ్యింది.విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ - 20
Advertisement

తాజా వార్తలు