బన్నీ 'ఐకాన్' సినిమాపై లేటెస్ట్ బజ్ !

టాలీవుడ్ సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

సరైన సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

Advertisement
Allu Arjun Icon Movie Latest Update, Allu Arjun, Pushpa, Sukumar, Tollywod, Venu

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

Allu Arjun Icon Movie Latest Update, Allu Arjun, Pushpa, Sukumar, Tollywod, Venu

అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత ఇంత వరకు మరొక సినిమా ప్రకటించలేదు.అయితే ఎప్పుడో ప్రకటించిన ఐకాన్ సినిమాను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది.

వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమా కంటే ముందు అల్లు అర్జున్ తో ఐకాన్ కనబడుటలేదు అనే సినిమాను ప్రకటించాడు.

Allu Arjun Icon Movie Latest Update, Allu Arjun, Pushpa, Sukumar, Tollywod, Venu

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అయితే పవన్ కళ్యాణ్ తో ఆఫర్ రావడంతో వేణు శ్రీరామ్ ఆ సినిమాను పక్కన పెట్టేసాడు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement

అంతేకాదు త్వరలోనే హీరోయిన్ ను కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారని లేటెస్ట్ బజ్ గట్టిగానే వినిపిస్తుంది.మరి చూడాలి ఈ సినిమాపై అధికారికంగా ఎప్పుడు అప్డేట్ వస్తుందో.

తాజా వార్తలు