త్రివిక్రమ్ పక్కా ప్లాన్.. సూపర్ స్టార్ తో ముగియగానే ఐకాన్ స్టార్ తో స్టార్ట్!

త్రివిక్రమ్ శ్రీనివాస్.ఈయన పేరు చెబితేనే ఆ సినిమా సూపర్ హిట్ అని ముందుగానే చెప్పేస్తారు.

అంతలా ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి.

ఇక ఈ సినిమా తర్వాత ఈయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.అతి త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు.

Advertisement
Allu Arjun And Trivikram Srinivas Reunite For Another Project, Pooja Hegde, Mahe

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు చాలా గ్యాప్ రావడంతో ఇక మహేష్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట.

ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా పూర్తి అవగానే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడట.

Allu Arjun And Trivikram Srinivas Reunite For Another Project, Pooja Hegde, Mahe
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ పూర్తి చేసుకుని త్రివిక్రమ్ తో జాయిన్ అవుతాడట.ఇలా త్రివిక్రమ్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండానే అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతి 2024 కు రిలీజ్ కూడా అయ్యేలా పక్కా ప్లాన్ తో ప్రిపేర్ అవుతున్నాడని సమాచారం.అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వచ్చాయి.

Advertisement

మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక ఇప్పుడు నాలుగవ సినిమా రాబోతుంది.

తాజా వార్తలు