మరో జాక్ పాట్ కొట్టేసిన అల్లు వారసురాలు.. ఆ పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్?

సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం సర్వసాధారణంగా జరిగే అంశం.ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు వారసురాళ్ళు ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సీనియర్ దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగారు.అల్లు అరవింద్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉన్నారు.

ఇక ఈయన వారసుడిగా అల్లు అర్జున్( Allu Arjun ) ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే.ఇలా అల్లు అరవింద్ వారసుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పేరు ప్రఖ్యాతలను పొందినటువంటి అల్లు అర్జున్ తన వారసులని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కి ఇద్దరు సంతానం కాగా తన కుమార్తె అర్హ( Arha ) ఇప్పటికే ఇండస్ట్రీలోకి బాల నటిగా ఎంట్రీ ఇచ్చారు.గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా( Shaakuntalam ) ద్వారా బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.

Allu Arha Got A Chance To Act Another Pan Indian Movie Details,allu Arjun,allu A
Advertisement
Allu Arha Got A Chance To Act Another Pan Indian Movie Details,Allu Arjun,Allu A

ఇక అర్హ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె బాల నటిగా ఇండస్ట్రీలోకి రాకముందే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఒక సినిమాలో నటించి తన నటనతో అందరిని మెప్పించిన అర్హకు తిరిగి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఈమె మరో పాన్ ఇండియా సినిమాలో కూడా నటించబోతున్నారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

Allu Arha Got A Chance To Act Another Pan Indian Movie Details,allu Arjun,allu A

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి వారిలో ఎన్టీఆర్( NTR ) కూడా ఒకరు.ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara )చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమాలో అర్హ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.అర్హ ఈ సినిమాలో నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ) చిన్నప్పటి పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఈ విధంగా ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె నటించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి అర్హ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే అర్హ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు