సంపాదనలో దేశంలోనే టాప్ హీరో.. ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరు హీరోలకంటే ఎక్కవ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ సందడి చేస్తుంటాడు.

ఏడాదిలో రెండు మూడు సినిమాలను ఖచ్చితంగా రిలీజ్ చేసే ఈ హీరో సంపాదన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.

తాజాగా వెలువరించిన ఫోర్బ్స్ జాబితా కూడా మనకు ఇదే చెబుతోంది.ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను 2020కి గాను ఫోర్బ్స్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ జాబితాలో భారత్ తరఫున అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీగా కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లు సాధించినవిగా నిలిచాయి.

అటు పలు కమర్షియల్ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ అక్షయ్ కోట్లలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు.దీంతో 2020లో అక్షయ్ ఏకంగా 48.5 మిలియన్ డాలర్లు సంపాధించినట్లు ఫోర్బ్స్ జాబితా ప్రకటించింది.కాగా ఫోర్బ్స్ జాబితాలో 52వ స్థానం దక్కించుకున్న అక్షయ్ వయసు ప్రస్తుతం 52.ఈ వయసులోనూ అదిరిపోయే సంపాదనతో మిగతా స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు ఈ యాక్షన్ కింగ్.ఇక ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న అక్షయ్ మరింత సంపాదనతో దూసుకెళ్లడం ఖాయమని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు.

Advertisement

ఏదేమైనా అక్షయ్ సాధించిన ఈ అరుదైన ఫీట్‌కు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!
Advertisement

తాజా వార్తలు