మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నియోజకవర్గాలను విభజిస్తారు.రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.
అతడినే శాసన సభ్యుడు లేదా ఎమ్మెల్యే అని అంటారు.ఇటీవల చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.
కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.కొన్ని చోట్ల ఊహించని ఫలితాలొచ్చాయి.
ఏకంగా ఒక రాష్ట్ర సీఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే.అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి.
అభ్యర్థులందరూ ఓటర్లకు హామీలు ఇస్తూ వరాల జల్లు కురిపించారు.కొంతమంది ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయి.
కొంతమంది ప్రణాళికలు విఫలమయ్యాయి.ఇలాంటి తరుణంలో జైలులో ఉన్న ఓ వ్యక్తి తనకు ఓటెయ్యాలంటూ ఎలాంటి ప్రచారం చేయకుండానే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేశాడు.తన తరపున బయట ఉన్న తన బంధువులు, అనుచరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అఖిల్ గొగోయ్ ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు.అయినా తన ప్రత్యర్థి పైన 11 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు.
తాజాగా జైలు నుండి బయటకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.కానీ ఆయన మళ్ళీ తిరిగి జైలుకెళ్లడం విశేషం.
సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇతర అభియోగాల కింద అఖిల్ గొగోయ్ ను ఎన్ఐఏ 2019లో అరెస్ట్ చేసింది.

అఖిల్ జైలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించాడు.అతడు శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
అఖిల్ గొగోయ్ ఇంకా బెయిల్ మంజూరు కాలేదు.
శుక్రవారం అసోం సీఎం హిమంత బిస్వా శర్మతో సహా 126 మంది ప్రమాణ స్వీకారం చేశారు.ఇందులో అఖిల్ గొగోయ్ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
దీంతో భద్రతా సిబ్బంది అఖిల్ గొగోయ్ ను జైలు నుండి సభకు తీసుకొచ్చారు.ప్రమాణస్వీకారం తిరిగి జైలుకు వెళ్లారు.
ఈ విషయం దేశం అంతటా చర్చనీయాంశం అయ్యింది.