శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి అమ‌ల అక్కినేనికి అంకితం ఇచ్చిన అఖిల్ అక్కినేని

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.నేడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

Akhil Akkineni Releases The First Single Of 'Sharwanand' Oke Oka Jeevitham 'and

ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి త‌న‌ తల్లి అమ‌ల అక్కినేనికి ఈ పాట‌ను అంకితం ఇచ్చారు.ప్రతీ తల్లికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది.

ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది.సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

Advertisement

అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు.చాలా కాలం తరువాత ఇలా హృదయాన్ని హత్తు కునేలా సాగే అమ్మ పాట ఇది.ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.ఫ్యామిలీ డ్రామాగా రాబోతోన్న ఈ సై-ఫై (సైన్స్ ఫిక్ష‌న్‌) చిత్రానికి సూజిత్ సారంగ్ కెమెరామెన్‌గా, తరుణ్ భాస్కర్ మాటల రచయితగా వ్యవహరించారు.

ఈ మూవీని ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు:

శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు: శ్రీ కార్తీక్, నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు,ప్రొడక్షన్ కంపెనీ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డైలాగ్స్: తరుణ్ భాస్కర్,డీఓపీ: సుజిత్ సారంగ్,ఎడిటర్: శ్రీజిత్ సారంగ్,సంగీతం: జేక్స్ బిజోయ్,ఆర్ట్ డైరెక్టర్: ఎన్ సతీష్ కుమార్ స్టంట్స్: సుదేష్ కుమార్,స్టైలిష్ట్ : పల్లవి సింగ్,లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్,పీఆర్వో: వంశీ-శేఖర్.

Advertisement

తాజా వార్తలు