అఖండ సినిమా చూడటానికి ట్రాక్టర్ లో థియేటర్ కు ప్రేక్షకులు.. ఎక్కడంటే?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు ఆదరణ అంతకంతకూ తగ్గుతోంది.

ప్రేక్షకులు క్లాస్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తూ రోటీన్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారు.

అయితే మాస్ సినిమాలను దర్శకులు సరిగ్గా డీల్ చేస్తే మాత్రం ఆదరిస్తున్నారు.మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే విధంగా అఖండ సినిమా ఉండగా సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి.

అయితే ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన గ్రామస్తులు అఖండ సినిమాను చూడటానికి ట్రాక్టర్ లో థియేటర్ కు వచ్చారు.

చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా థియేటర్ కు ట్రాక్టర్లలో ప్రేక్షకులు రావడం గమనార్హం.ఈ ఘటన బాలయ్య క్రేజ్ కు నిదర్శనమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాకు ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం గ్రామాల నుంచి ప్రేక్షకులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో పట్టణాలకు వెళ్లి సినిమాలు చూసేవాళ్లు.సినిమాకు ట్రాక్టర్ లో వచ్చిన వాళ్లలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.సినిమా రిలీజైన రెండు నెలలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య అస్సలు తగ్గడం లేదనే చెప్పాలి.

బాలయ్యకు నటుడిగా కూడా అఖండ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.బాలయ్య భవిష్యత్తు సినిమాలు అఖండ సినిమాను మించి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.బాలయ్య భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య, శృతిహాసన్ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు