పెద్ద సినిమాల బిజినెస్‌ లో 'ఆహా' కనిపించడం లేదేం?

థియేటర్లు ఓపెన్‌ లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ దారి పడుతున్నాయి.బాలీవుడ్‌ లో మొదట పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి.

ఆ తర్వాత కోలీవుడ్‌ స్టార్స్‌ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు.ఇప్పుడు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నారు.

ఇంకా ఎన్ని నెలుల అని పూర్తి అయిన సినిమాలను ల్యాబ్‌ ల్లో ఉంచుకుంటాం అనుకుని టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కొందరు ఓటీటీ విడుదలకు సిద్దం అవుతున్నారు.ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమాలను కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ మరియు నెట్‌ఫ్లిక్స్‌లు పోటీ పడుతున్నాయి.ఈ రెండు కూడా ఇప్పటికే చాలా తెలుగు సినిమాలను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

Advertisement

ఈ జాబితాలో ఇప్పుడు జీ5 కూడా వచ్చి చేరింది.ఇప్పటి వరకు హిందీ సినిమాలపైనే దృష్టి పెట్టిన జీ5 ఇప్పుడు తెలుగులో సోలో బ్రతుకే సోబెటర్‌ మరియు ఒరేయ్‌ బుజ్జి సినిమాలను కొనుగోలు చేసి ప్రసారంకు సిద్దం అయ్యింది.

అయితే ఆహా మాత్రం ఇప్పటి వరకు పెద్ద సినిమాల జోలికి కూడా వెళ్లడం లేదు.

తమ బ్యానర్‌ లో రూపొందుతున్న సినిమాలను కూడా ఆహాలో ప్రసారం చేయాలని అల్లు అరవింద్‌ భావించం లేదు.ఇప్పటి వరకు కేవలం చిన్న రేంజ్‌ సినిమాలను మాత్రమే ఆహా వారు కొనుగోలు చేస్తున్నారు.కోటి లోపు బడ్జెట్‌ సినిమాలను మాత్రమే ఆహా కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంది.

ఇప్పుడిప్పుడే ఆహా ఫామ్‌ లోకి వస్తుంది.ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలను కొనుగోలు చేయాల్సిన అవసరం చాలా ఉంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?

కాని ఆహా వాళ్లు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.ముందు ముందు అయినా భారీ సినిమాలను ఆహా కొనుగోలు చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు