రేపు ఆందోళనకు సిద్దమవుతున్న అడ్లూరు వాసులు

సూర్యాపేట జిల్లా:పులిచింతల ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం అడ్లూరు.అప్పుడు చింతలపాలెం మండలంలో ఉండగా ప్రాజెక్టులో మునిగిపోయింది.

అక్కడి నుండి వారిని కోదాడ మండలంలోకి తరలించారు.ప్రస్తుతం కోదాడ మండలం గుడిబండ శివారులో ఉన్న అడ్లూరు గ్రామంలో నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను అక్రమంగా విక్రయిస్తున్నారని,వెంటనే ఆ ప్రక్రియను ఆపేయాలని డిమాండ్ చేస్తూ రేపు బుధవారం 15 న గ్రామస్థులంతా కలసి హుజుర్ నగర్ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు సమాచారం.

*నిర్వాసితుల ప్రధాన డిమాండ్లు ఇవే* 1.పులిచింతల పునరావాస కేంద్రం అయినటువంటి కోదాడ మండలం గుడిబండ శివారులోని అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ కి ఇతర పులిచింతల ఆర్ అండ్ ఆర్ సెంటర్ నుండి ప్లాట్ల బదిలీలు వెంటనే నిలిపివేయాలి.2.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో ఇప్పుడు దాకా అక్రమ మార్గంలో చేసిన రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి.3.ఫేక్ పట్టాలను తయారు చేసి ఉన్నత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.4.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో ఖాళీగా ఉన్న అన్ని ప్లాట్లను రీ సర్వే చేసి అర్హులైనటువంటి గ్రామానికి చెందిన ప్రజలకు కేటాయించాలి.5.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ యొక్క అధికారాలను కోదాడ డివిజన్ పరిధిలోకి తీసుకురావాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024
Advertisement

Latest Suryapet News